ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. 90ఏళ్ల వృద్ధురాలిని కూడా వదలకుండా...

Published : Mar 02, 2020, 08:49 AM IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. 90ఏళ్ల వృద్ధురాలిని కూడా వదలకుండా...

సారాంశం

ఆ బాలిక ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. మద్యం తాగి అటుగా వస్తున్న జోరుక రమేష్‌ (38) ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగివెళ్తుండగా గమనించిన గ్రామస్థులు విషయం తెలుసుకున్నారు.  

రోజురోజుకీ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. పాలుతాగే పసిబిడ్డ దగ్గర నుంచి.. కాటికి కాలు చూసి కూర్చున్న ముసలమ్మ దాకా.. ఎవరినీ కామాంధులు వదలడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కామాంధుల ఆకలికి బలయ్యారు. వారిలో ఒకరు ఆరేళ్ల చిన్నారి కాగా.. మరొకరు 90ఏళ్ల బామ్మ కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై  ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. వారి ఒక్కగానొక్క కూతురును నానమ్మ వద్ద ఉంచారు. 

ఆ బాలిక ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. మద్యం తాగి అటుగా వస్తున్న జోరుక రమేష్‌ (38) ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగివెళ్తుండగా గమనించిన గ్రామస్థులు విషయం తెలుసుకున్నారు.

Also Read మైనర్ బాలికను కిడ్నాప్ చేసి... బలవంతంగా పెళ్లి....

రక్తస్రావం కావడంతో నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. మరో ఘటనలో నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లిలో శనివారం రాత్రి ఓ వృద్ధురాలు (90) హత్యకు గురైంది. 

ఇంట్లో ఆమె ఒంటరిగా నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం ఆమెను హత్య చేసి పరారయ్యాడని హాలియా సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. వృద్ధురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

PREV
click me!

Recommended Stories

పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu
Viral News: అక్క‌డ మందు తాగితే 25 చెప్పు దెబ్బ‌లు, రూ. 5 వేల ఫైన్‌.. వైర‌ల్ అవుతోన్న పోస్ట‌ర్