మద్యంమత్తులో.. గర్భిణీ భార్యను నరికి, తానూ నరుక్కుని.. ఓ భర్త ఘాతుకం..

Published : Aug 26, 2022, 09:18 AM IST
మద్యంమత్తులో.. గర్భిణీ భార్యను నరికి, తానూ నరుక్కుని.. ఓ భర్త ఘాతుకం..

సారాంశం

కామారెడ్డిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ భర్త గర్భణి అయిన భార్యను దారుణంగా నరికాడు. తరువాత తానూ నుదుటిమీద నరుక్కున్నాడు. దీంతో ఇద్దరూ మృతి చెందారు. 

కామారెడ్డి  : తన దురలవాట్లకు అడ్డు చెబుతున్న భార్యను గొడ్డలితో నరికేశాడో కసాయి భర్త. ఆ తరువాత తానూ నరుక్కున్నాడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన సరుగు సత్తవ్వ.. నారాయణ దంపతులకు సంతానం లేకపోవడంతో సంజీవులు(29)ను చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. ఆరేళ్ల క్రితం గాంధారి మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన రమ్యశ్రీ (24)తో  వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా అతను తరువాత మద్యానికి బానిస జులాయిగా తిరిగేవాడు.

 పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని ఆమె అభ్యంతరం తెలపడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇటీవలే పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి తిరిగి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణీ. గురువారం ఉదయం సంజీవులు భార్యతో గొడవపడ్డాడు. మత్తులో గొడ్డలితో ఆమె మెడపై నరకడంతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత అతను అదే గొడ్డలితో తన నుదిటిపై నరుక్కున్నాడు. రక్తమోడుతూనే తండ్రిని కూడా నరికేస్తా అంటూ పొలంవైపు వెళుతూ.. రక్తస్రావం ఎక్కువ కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినాడు. సంజీవులు, రమ్యశ్రీ  దంపతులకు  మూడేళ్ల కూతురు సహశ్రీక ఉంది. 

హిందూపురంలో వైద్య విద్యార్థిని మృతి కేసులో ట్విస్ట్.. బస్సులో పరిచయం.. ప్రేమిస్తున్నానని వెంటపడి, వేధించి..

ఇదిలా ఉండగా, తమిళనాడులో ఆగస్ట్ ఒకటిన ఇలాంటి ఘోరమో ఒకటి వెలుగులోకి వచ్చింది. నారాయణవనం మండలంలోని కైలాసకోన కొండపై గతనెల భర్త చేతిలో హత్యకు గురైన వివాహిత మృతదేహం ఆనవాళ్లను పోలీసులు ఆగస్ట్ 1న కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా సింగూర్ ప్రాంతానికి చెందిన మదన్, తమిళ సెల్వి మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మదన్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో పాటు.. భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు.దీంతో వరకట్నం పేరుతో తరచు వేధిస్తుండేవాడు.  జూన్ 25న తమిళ సెల్వితో కలిసి కైలాసకోనకు వచ్చాడు. ఆమెను కొండమీద ఉన్న బావుల సమీపంలోని అటవీ ప్రాంతం వద్దకు తీసుకువెళ్లి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

కూతురు కనిపించకపోవడం.. ఆమె తల్లిదండ్రులు మణ్ గండన్, పల్గీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మదన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు మదన్ చెప్పుకొచ్చాడు. ఆమెను కైలాసకోన కొండపైకి తీసుకు వెళ్లానని, తమ మధ్య గొడవ జరిగిందని, కత్తితో పొడిచానని చెప్పాడు. ఆ తరువాత ఆమె తీవ్రంగా గాయపడటంతో.. అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసానని చెప్పాడు. గంజాయి మత్తులో ఉండడంతో ఆ ప్రాంతం సరిగా గుర్తు లేదు అని కూడా చెప్పాడు. నిందితుడు చెప్పిన సమాచారం ప్రకారం తమిళనాడు ఎస్సై రమేష్ కైలాసపురంలో ప్రత్యేక బృందంతో తమిళసెల్వి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నెలరోజుల తర్వాత కొండపై తమిళసెల్వి దుస్తులు, మెట్టెలు, పాదరక్షలు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించి పంచనామా చేపట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu