స్నేహితురాలి చెప్పుడు మాటలు విని భార్య దారుణ హత్య, వీడియో తీసి.. చివరికి..

By Bukka SumabalaFirst Published Sep 3, 2022, 8:37 AM IST
Highlights

హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. స్నేహితురాలి చెప్పుడు మాటలు విని భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో సురేందర్ తో పాటు, తల్లి, అతని స్నేహితురాలు.. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ : భార్యను అనుమానించి, కిరాతకంగా హత్య చేసిన పాత నేరస్తుడితో పాటు సహకరించిన అతని తల్లిని సైతం అరెస్టు చేశారు. వీరిని రిమాండ్ కు తరలించిన సంఘటన ఎల్బీనగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి కథనం ప్రకారం… మీర్ పేట సమీపంలోని నందనవనం కాలనీలో నివసించే కీర్తి, సల్మాన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు మనస్పర్థలతో విడిపోయారు. కీర్తి మరో పెళ్లి చేసుకుంది. తన అన్నను వదిలి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు సల్మాన్ సోదరి సభ ఫాతిమా (18)కు కీర్తితో విభేదాలు వచ్చాయి. ఇద్దరి మధ్య పగ పెరిగింది. 

ఇదిలా ఉండగా, కీర్తి స్నేహితుడు, సురేందర్ అలియాస్ మోయిన్, మునీర్(28) అనే వ్యక్తితో సబా ఫాతిమాకు స్నేహం ఉండేది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే సురేందర్ సుమారు 40 కేసుల్లో నిందితుడు. పీడీ యాక్ట్ కేసులు కూడా అతనిమీద ఉన్నాయి. సబా ఫాతిమాతో వివాహం అయిన తరువాత మరోసారి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చి తన మకాంని బైరామల్ గూడ అల్తాఫ్ నగర్ కు మార్చాడు. అక్కడే తల్లి భార్యతో కలిసి ఉంటున్నాడు. సబా ఫాతిమా అక్కడే ఓ పాపకు జన్మనిచ్చింది.

భార్య ఫోన్ లో మాట్లాడుతుందని కొట్టి చంపిన భర్త.. చివరికి...

అనుమానం నూరిపోసి..
ఈ క్రమంలో ఓ చోరీకేసులో బాలాపూర్ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరిగి ఈ ఏడాది జూలైలో విడుదల అయిన సురేందర్ కు అతని భార్య పట్ల సమీపంలోని ఓ ఇంట్లో ఉంటున్న కీర్తి చెడుగా ప్రచారం చేసింది. మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉందంటూ అతనికి నూరిపోసింది. దీంతో సురేందర్ తన భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ తాగి కొట్టేవాడు. గత నెల 30వ తేదీ రాత్రి తప్పతాగి వచ్చి ఆమె తలను గోడకేసి కొట్టడంతో ఫాతిమా అపస్మారక స్థితికి చేరింది. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.  

ఇదంతా సురేందర్ తల్లి యాదమ్మ (58) చూస్తూనే ఉంది కానీ.. ఆపే ప్రయత్నం చెయ్యలేదు. దీంతో ఫాతిమా అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సురేందర్ తో పాటు అతని తల్లిని, కీర్తిని  అరెస్టు చేశారు. తల్లి మరణంతో అనాథగా మారిన తొమ్మిది నెలల వయసున్న కుమార్తెను పోలీసులు శిశువిహార్ కు తరలించారు. 

click me!