మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని.. నేలకేసి కొట్టి.. ఓ కసాయి తండ్రి అమానుషం..

By AN TeluguFirst Published Nov 3, 2021, 7:32 AM IST
Highlights

new born babyని నిర్ధాక్షిణ్యంగా నేలకు కొట్టి బలి తీసుకున్న హృదయవిదారక సంఘటన కొమురం భీం జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన  లైన్ గూడ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

వాంకిడి :  ఆడపిల్ల పుట్టిందన్న కోసం ఆ తండ్రిని విచక్షణ కోల్పోయేలా చేసింది. పసిగుడ్డు అని కూడా చూడకుంగా కర్కోటకుడిలా మారేలా చేసింది. అప్పుడే కళ్లు తెరిచిన లోకం పోకడ తెలియని చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండేలా చేసింది. తన తప్పేం ఉందో కూడా తెలియని ఆ చిన్నారి అమానుషంగా బలైపోయింది. 

చిన్నారి బోసినవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట మరణ మృదంగం మోగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పసిబిడ్డను  మద్యం మత్తులో కన్న తండ్రే కసాయిగా మారి కడతేర్చిన ఘటన తీవ్ర విషాదం నింపింది.  

ముందు ఇద్దరూ girl child ఉండడంతో మూడోసారైనా అబ్బాయి పుడతాడని ఓ తండ్రి ఆశపడ్డాడు. కానీ అతని ఆశ నిరాశ చేస్తూ..మూడో సంతానం కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో ఓ తండ్రి కసాయిగా మారాడు. 

new born babyని నిర్ధాక్షిణ్యంగా నేలకు కొట్టి బలి తీసుకున్న హృదయవిదారక సంఘటన కొమురం భీం జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన  లైన్ గూడ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

కాగజ్ నగర్  గ్రామీణ  ఎస్ ఐ రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం…  కాగజ్ నగర్ మండలంలోని  లైన్ గూడా పంచాయతీ కేంద్రానికి చెందిన  గిరిజన దంపతులు  బాపురావు- మనీషాలకు ఇద్దరు ఆడపిల్లలు  మౌనిక (5),  అశ్విని (3)  ఉన్నారు.  45 రోజుల కిందట Third childగా ఆడపిల్ల జన్మించింది.

Huzurabad ByPoll: ప్రత్యర్ధులిద్దరూ చోటా నేతలే.. అయినా ఈటల మెజారిటీ ఎందుకు తగ్గిందంటే..?

ఆడపిల్ల పుట్టిందని అప్పటినుంచి బాపురావు రోజూ liquor తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.  సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మౌనిక, అశ్విని టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లారు. ఇంట్లో  మనీషా తో పాటు  చిన్నారి ఉంది.  భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. 

మత్తులో విచక్షణ కోల్పోయిన బాపురావుకు.. మంచంపై అమాయకంగా నిద్రిస్తున్న పసిపాప కనిపించింది. అప్పటికే తానేం చేస్తున్నాడో కంట్రోల్ లేని అతను చిన్నారిని అమాంతం ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు. తనకు ఆడపిల్ల వద్దంటూ కసిగా నేలకేసి కొట్టాడు.  దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.  

అప్పటికి కానీ అతనిలోని కోపాగ్ని చల్లారలేదు. వెంటనే తానేం చేశాడో అర్థం అయ్యింది. అంతే ఆ తర్వాత సర్పంచ్ ఇంటికి వెళ్ళి విషయం చెప్పాడు. ముందు షాక్ కు గురైన సర్పంచ్.. ఆ తరువాత వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు  నిందితుడిని  వెంటనే అదుపులోకి తీసుకున్నారు.   

మంగళవారం కాగజ్ నగర్ గ్రామీణ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. హత్యకు కారణం ఆడపిల్ల పుట్టిందనే క్షణికావేశమేనా, మరేదైనా కారణం ఉందా, లేక భార్యభర్తల మధ్య గొడవలు చిన్నారి హత్యకు దారి తీశాయా? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

click me!