Huzurabad ByPoll: ఈటల విజయంపై అమిత్ షా హర్షం.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలంటూ తెలుగులో ట్వీట్

By Siva KodatiFirst Published Nov 2, 2021, 9:41 PM IST
Highlights

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (etela rajender), తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.

అంతకుముందు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేసిన అమిత్.. ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈటల విజయం దిశగా ముందుకు సాగడంపై అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని bandi sanjayకి సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే బీజేపీ విజయం సాధించిందని Amit Shah అన్నారు.

Also Read:హుజురాబాద్ లో ఈటల విక్టరీ ఎఫెక్ట్: ఇక తెరాసపై మరిన్ని తిరుగుబాట్లు..?

కాగా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో  బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 24,068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిగింది. 

అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తన విజయాన్ని హుజురాబాద్ (huzurabad bypoll) ప్రజలకు అంకితం చేస్తున్నా అన్నారు . హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. బెదిరింపులకు ప్రజలకు భయపడేది లేదని.. ఉపఎన్నికలో భారీగా డబ్బులు, మద్యం పంపిణీ చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజురాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్ధితి తెచ్చారని ఆయన అన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు యత్నించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

వాళ్లు డబ్బు సంచులు, అక్రమాలు, అన్యాయాన్ని నమ్ముకున్నారని ఈటల ఆరోపించారు. అమెరికాలో ఉన్నా, లండన్‌లో ఉన్నా, సూరత్‌లో ఉన్నా ఉప ఎన్నిక కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని రాజేందర్ అన్నారు. కేసీఆర్‌ అహంకారం పోవాలని కోరుకున్నారని.. ఉప ఎన్నికలో చివరికి కుల ఆయుధం కూడా ఉపయోగిస్తారని ఈటల మండిపడ్డారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని.. 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇష్టారీతిన డబ్బులు ఖర్చు చేశారని రాజేందర్ ఆరోపించారు. 


 

హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రధాని శ్రీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు బిజెపి కట్టుబడి ఉంది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ , అభ్యర్థి శ్రీ కార్యకర్తలకు అభినందనలు.

— Amit Shah (@AmitShah)
click me!