ప్రస్తుత హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది.
ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad byPoll) బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ (etela rajender) విజయం సాధించారు. తద్వారా వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడింటిలో నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించగా.. మూడు సార్లు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నాలుగుసార్లు, తెలంగాణ అసెంబ్లీకి మూడుసార్లు ఈటల గెలిచారు.
తొలుత కమలాపూర్ (kamalapur) నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించగా.. ఆ తర్వాత ఐదు సార్లు హుజురాబాద్ నుంచే విజయ బావుట ఎగురవేశారు. ప్రస్తుత ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది. 2004లో అత్యత్పలంగా 19 వేల మెజారిటీతో గెలుపొందిన ఈటల.. 2010 ఎన్నికల్లో అత్యధికంగా 79 వేల మెజారిటీ సాధించారు. ఆ వివరాలు ఒకసారి చూస్తే..
undefined
వరుస పెట్టి ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధిస్తూ వస్తున్న ఈటల రాజేందర్‌కు ఈసారి వచ్చింది కూడా తక్కువేం కాదు. అయితే అనేక అంశాలు ఈటల మెజారిటీని తగ్గించడానికి కారణమయ్యాయి. ఇందులో ప్రధానమైనది దళిత బంధు. ఎన్నికలను దృష్టిలో వుంచుకుని కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. నియోజకవర్గంలోని పలు దళిత కుటుంబాలకు డబ్బును వారి ఖాతాల్లో జమచేశారు కూడా. దీనిని అందుకున్న లబ్ధిదారుల్లో కొన్ని కుటుంబాలు టీఆర్ఎస్‌కు జై కొట్టాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక నియోజకవర్గంలోని బలమైన కులాలైన పద్మశాలి, గౌడ, ముదిరాజ్, యాదవలు కొన్నేళ్లుగా టీఆర్ఎస్‌కు మద్ధతుగా వుంటూ వస్తున్నారు. సహజంగానే వీటిలో కొన్ని గులాబీ పార్టీ వైపు టర్న్ అయి వుండవచ్చు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్ధి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ (gellu srinivas yadav) .. స్వయంగా యాదవ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ వర్గానికి ఇక్కడ 22 వేల వరకు ఓట్లు వుండటంతో అవి చీలిపోయి వుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు మరికొన్ని కారణాల వల్ల ఈటల రాజేందర్‌కు అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదని తెలుస్తోంది.