ఎల్ఐసి డబ్బులకు ఆశపడి భార్యనే చంపాడు: ఆమె అమెజాన్ ఉద్యోగిని

First Published 11, May 2018, 7:31 AM IST
Highlights

ఎల్ఐసి డబ్బులకు ఆశపడి ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే హత్య చేశాడు. 

హైదరాబాద్: ఎల్ఐసి డబ్బులకు ఆశపడి ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే హత్య చేశాడు. నిందితుడిని హైదరాబాదులోని కార్ఖాన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతురాలు మహేశ్వరి గుజ్జార్ అమెజాన్ లో ఉద్యోగం చేస్తోంది.

తన 31 ఏళ్ల భార్యను గంటా శ్రీనివాస కుమార్ అనే ప్రబుద్ధుడు హత్య చేశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన సికింద్రాబాదులోని కార్ఖానా వాసవి నగర్ లో ఉంటున్నాడు. 

రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉంటున్న ఎపిఎస్ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగి అయిన గుజ్జార్ కృష్ణాజీరావు కూతురు మహేశ్వరితో 2016లో శ్రీనివాస కుమార్ వివాహం జరిగింది. వారిద్దరిది కులాంతర వివాహం.  

Last Updated 11, May 2018, 7:31 AM IST