తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. పార్టీ నుంచి ముగ్గురు నేతల సస్పెన్షన్

Published : Sep 26, 2018, 12:12 PM ISTUpdated : Sep 26, 2018, 12:27 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. పార్టీ నుంచి ముగ్గురు నేతల సస్పెన్షన్

సారాంశం

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు ఉప్పలయ్య అనే కార్యకర్త గత కొద్దిరోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు ఉప్పలయ్య అనే కార్యకర్త గత కొద్దిరోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

పార్టీతో సంబంధం లేకుండా మండల కేంద్రంలో మరో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం.. జెండా పండుగ కార్యక్రమాన్ని వేరుగా నిర్వహించడం తదితర కారణాలతో పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని మండల కాంగ్రెస్ కమిటీ తేల్చింది. క్రమశిక్షణా సంఘం తీర్మానం మేరకు ముగ్గురిని పార్టీ నుంచి  సస్పెండ్ చేస్తున్నట్లు.. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu