ప్రముఖ యాంకర్, నటి ఫొటోలు మార్పింగ్, అసభ్య పదజాలంతో పోస్టింగులు.. కొబ్బరి రైతు అరెస్ట్.,.

Published : Nov 28, 2022, 11:21 AM IST
ప్రముఖ యాంకర్, నటి ఫొటోలు మార్పింగ్, అసభ్య పదజాలంతో పోస్టింగులు.. కొబ్బరి రైతు అరెస్ట్.,.

సారాంశం

ఓ ప్రముఖ నటి, యాంకర్ ఫొటోలను మార్పింగ్ చేసి వేధింపులకు పాల్పడిన కేసులో కోనసీమకు చెందిన ఓ కొబ్బరి రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ : టాలీవుడ్ నటీమణుల అసభ్యకర మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల కొబ్బరి రైతును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ పి నరేష్ మాట్లాడుతూ పి రామ వెంకట వీర్రాజు అనే వ్యక్తి  తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, బుల్లితెర యాక్టర్లు, యాంకర్ల వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని మార్ఫింగ్ కు పాల్పడతున్నారు.

"అతను ఆ చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలతో అప్‌లోడ్ చేసేవాడు. అంతేకాదు ఇలా తాను పోస్ట్ చేసిన వీడియోల తాలూకు యాక్ట్రెస్ లు కొంతమందికి  వీర్రాజు  ఫోన్స్ కూడా చేసేవాడు, కానీ ఎవరూ స్పందించలేదు. అతను అలా 20 మంది నటీమణుల అసభ్యకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసాడు" అని పోలీసులు తెలిపారు.

విషాదం.. హైదరాబాద్ లో క్రికెట్ ఆడుతూ గుండెనొప్పితో టెకీ మృతి..!

ఓ యాంకర్ కమ్ నటి ఫిర్యాదు మేరకు వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఫిర్యాదుదారుడిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన విషయాలను పోస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు పట్టుకోగా, అతను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నాడని తెలుసుకున్నారు.

కోనసీమ జిల్లా పసలపూడికి చెందిన ఇతను ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ పనులు చేస్తున్నాడని తేలింది. నిందతుడి ల్యాప్ టాప్ తో పాటు సెల్ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలామంది యాంకర్లు, బులితెర నటులు, హీరోయినల మార్ఫింగ్ ఫొటోలు బయటపడ్డాయి. దీంతో అతని మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu