మాపై సోషల్ మీడియాలో పోస్టింగుల వెనుక కాంగ్రెస్ ముఖ్యులే: ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published May 19, 2023, 4:54 PM IST


మాజీ  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్  రెడ్డి సంచలన వ్యాఖ్యలు  చేశారు.  తమపై  పోస్టింగుల వెనుక  కాంగ్రెస్ ముఖ్యులే ఉన్నారని ఆయన  ఆరోపించారు.


హైదరాబాద్ :సోషల్ మీడియాలో  తమపై  దుష్ప్రచారం చేస్తూ  పెట్టిన  పోస్టింగుల వెనుక   కాంగ్రెస్ పార్టీ ముఖ్యులే  ఉన్నారని  నల్గొండ  ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి  సంచలన  వ్యాఖ్యలు  చేశారు.శుక్రవారంనాడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి  తన నియోజకవర్గంలో  జరిగిన   పార్టీ కార్యకర్తల సమావేశంలో  ఆయన  ప్రసంగించారు. తమపై  ఎవరో పై నుండి  పోస్టులు పెట్టించారన్నారు. తమ వ్యక్తిత్వాన్ని  దెబ్బతీసేలా  పోస్టింగులు పెడుతున్నారని  ఆయన  విమర్శించారు. 

తమను దెబ్బతీసేలా  సోషల్ మీడియాలో   చేసిన  . పోస్టింగుల వెనుక ఎవరున్నారో  కొన్ని రోజుల తర్వాత విరంగా చెబుతానన్నారు. ఏ ఎల్లిగాడో  మల్లిగాడో  ప్రశాంత్ పెట్టిన పోస్టులు కావని  ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.

Latest Videos

 కాంగ్రెస్ పార్టీకి  చెందిన  నేతలు  ఉత్తమ్ కుమార్ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి  వంటి  నేతలపై  సోషల్ మీడియాలో ట్రోలింగ్  చేసిన విషయం తెలిసిందే.  ఈ విషయమై  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఫిర్యాదు  చేశారు.

హైద్రాబాద్ లో  యూత్ కాంగ్రెస్  వార్ రూమ్  పై  ఈ నెల  15వ తేదీన  రాత్రి  పోలీసులు దాడికి దిగారు.  యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ లోని  కంప్యూటర్లను  పోలీసులు  తీసుకెళ్లారు.  మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఫిర్యాదు మేరకు  పోలీసులు  పోలీసులు  యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ పై  పోలీసులు దాడి  చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఫిర్యాదు మేరకు  పోలీసులు  నిఘా ఏర్పాటు  చేయడంతో  బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ నుండి  ఈ పోస్టింగ్ లు  పెడుతున్నారని  గుర్తించారు. యూత్ కాంగ్రెస్  వార్ రూమ్ పై దాడి  చేసి కంప్యూటర్లు తీసుకెళ్లారు. ఈ విషయమై  యూత్ కాంగ్రెస్ నేత ప్రశాంత్  పై సస్పెన్షన్ వేటు పడింది.  ఈ కేసులో  సస్పెన్షన్ కు గురైన  యూత్ కాంగ్రెస్ నేత  ప్రశాంత్  పోలీసుల విచారణకు  హాజరయ్యారు.  ఈ విషయమై  ఉత్తమ్ కుమార్ రెడ్డి తన దృష్టికి తెచ్చారని  ప్రశాంత్ మీడియాకు  చెప్పారు. అయితే  కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే ఇదంతా  జరిగిందని  ప్రశాంత్ చెప్పారు.  ఈ విషయాలపై  పోలీసుల విచారణకు  సహకరిస్తామని  ప్రశాంత్  మీడియాకు రెండు రోజుల క్రితం  తెలిపారు.

click me!