కిలాడీ కపుల్... ఫేస్ బుక్ లో పరిచయమై, ప్రేమపేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ముగ్గులోకి దింపి, కోటి స్వాహా....!

By AN Telugu  |  First Published Nov 24, 2021, 1:54 PM IST

కళ్యాణి శ్రీ అనే పేరుతో ఫేస్ బుక్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు పరిచయమయ్యారు ఓ కిలాడీ దంపతులు. ఆ పరిచయాన్ని మెల్లిగా ప్రేమలోకి దింపారు. అలా దాదాపు ఏడాదిన్నర పాటు  అతనితో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. ఆ తర్వాత దశలవారీగా కోటి రూపాయలు కాజేశారు.  అయితే వారు చెప్పే మాటలతో తీరా మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
 


హైదరాబాద్ : ఆ దంపతులు అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నారు. దానికోసం ఫేస్ బుక్ లో అకౌంట్ ను క్రియేట్ చేశారు. ఆ తరువాత ప్రేమ, పెళ్లి పేరిట ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేశారు. ఈ కిలాడి దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సికింద్రాబాదులో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు గుంటూరు జిల్లాకు చెందిన యర్రగుడ్ల దాసు, జ్యోతి దంపతులు. వీరు కళ్యాణి శ్రీ అనే పేరుతో facebookలో ఓ software engineer కు పరిచయమయ్యారు. 

ఆ పరిచయాన్ని మెల్లిగా ప్రేమలోకి దింపారు. అలా దాదాపు ఏడాదిన్నర పాటు  అతనితో love affair సాగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. ఆ తర్వాత దశలవారీగా కోటి రూపాయలు కాజేశారు.  అయితే వారు చెప్పే మాటలతో తీరా మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ Cybercrime policeలను ఆశ్రయించాడు.

Latest Videos

undefined

కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొందరగానే నిందితులను గుర్తించారు. ఆ తర్వాత ఏపీ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి కి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచి మంగళవారం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా,  బాధిత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు 40 ఏళ్లు వస్తున్న పెళ్లి కాలేదు. ఈ క్రమంలో 
Yarragudla Dasu... కళ్యాణి శ్రీ పేరుతో ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా అతను నిజంగా మహిళేనని నమ్మాడు. అలా వారి పరిచయం, ఛాటింగ్ నుంచి ముందుకువెళ్లింది. అయితే వీరిద్దరూ ప్రేమ పేరిట కేవలం చాటింగ్ మాత్రమే చేసే వారని తెలిపారు. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడదామని అడిగినా.. photos చూపించమని అడిగినా.. తాము విజయవాడ లో ఉంటామని.. తమది సంప్రదాయ కుటుంబం అని.. ఇలాంటివి తెలిస్తే చంపేస్తారని.. అతను నచ్చాడు కాబట్టి దొంగతనంగా ఛాటింగ్ చేస్తున్నాని చెప్పుకొచ్చాడు.

కేసీఆర్ గారు... అన్నదాతల ఉసురు పోసుకోవద్దు..: ఈటల సీరియస్

ఈ విషయాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నమ్మేశాడు. ఈ క్రమంలో ఇంట్లో సమస్యలు ఇంకా ఏవేవో కారణాలు చెప్పి అతని నుంచి డబ్బులు తీసుకుని తీసుకున్నట్లు తెలిపారు. phone చేయకుండా షరతులు విధించి కేవలం చాటింగ్ మాత్రమే చేసేవాడిని తెలిపారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను love చేస్తున్నానని, పెళ్లి చేసుకుందాం అని message చేయడంతో అందుకే ఒప్పుకుని.. పెళ్లి సంబంధం మధుసూదన్ అనే వ్యక్తి తో మాట్లాడాలని చెప్పాడు. ఈ మేరకు నిందితుడు ఒక ఫోన్ నెంబర్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఇచ్చారని తెలిపారు.

మధుసూదన్ లాగా కూడా దాసే నటించాడని పోలీసులు పేర్కొన్నారు. అలా నటిస్తూ దాసు దంపతులు 2020 జూన్ నుంచి 2021 అక్టోబర్ వరకు కోటి రూపాయలు కాజేసినట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి పేరుతో మోసం చేసిన దాసు నూజివీడు ట్రిపుల్ ఐటీ పూర్తి చేసి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేశాడని పోలీసులు వెల్లడించారు. 
 

click me!