హుజురాబాద్ ప్రజలతో బిజెపి ఎమ్మెల్యే ఎంతలా మమేకం అవుతారో తెలియజేసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో ఈటల సింప్లిసిటీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కరీంనగర్: ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను కాదని ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించిన విషయం తెలిసిందే. దళిత బంధు వంటి అద్భుత పథకం, నియోజకవర్గ అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ హామీలను కాదని హుజురాబాద్ ప్రజలు eatala rajender ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇంతలా హుజురాబాద్ ప్రజలు ఆయనపై ప్రేమాభిమానాలు కలిగివున్నారంటేనే ఆయన ప్రజలతో ఏస్థాయిలో మమేకం అవుతారో అర్థమవుతుంది. తన ప్రజలతో ఈటల ఎలా వుంటారో కళ్లకుకట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అందరు నాయకులు తమ నియోజకవర్గ ప్రజలను తమ కుటుంబసభ్యులుగా చూసుకుంటామని అంటుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ మాటను నిజంగా ఆచరిస్తుంటారు. అలాంటివారిలో ఈటల ఒకరు. సహాయం కోసం తనవద్దకు వచ్చేవారికి భోజనం పెట్టకుండా పంపించరని ఈటలకు మంచిపేరుంది. సమయం ఏదయినా, ఎంతమంది వచ్చినా అందరికీ కడుపునిండా అన్నంపెట్టి పంపిస్తారని ఈటల గురించి తెలిసినవారు, నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు.
undefined
ఈ మాటలు వింటుంటే ఈటల గురించి గొప్పలు చెబుతున్నారని అనుకుంటుంటాం. కానీ నిజంగానే ఆయన ప్రజలతో ఎలా మమేకం అవుతారో తెలియజేసే ఫోటో ఒకటి బయటకు వచ్చింది. నిరుపేద మహిళలలో కలిసి ఈటల రాజేందర్ భోజనం చేస్తుండగా ఎవరో ఫోటో క్లిక్ మనిపించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
read more రవిశంకర్ గురూజీని కలిసిన బిజెపి ఎమ్మెల్యే ఈటల... గంటసేపు భేటీ... అందుకోసమేనా?
ఈ ఫోటో నేపథ్యంలో హుజురాబాద్ లో ఈటల గెలుపు మరోసారి చర్చనీయాంశమయ్యింది. ప్రజలతో ఇలా మమేకం అవుతారు కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈటలను ఓడించలేకపోయారని అభిప్రాయపడుతున్నారు. ప్రజలమనిషి ఈటలకు నిరుపేదలే వీఐపిలని... వారి ప్రేమాభిమానాలే ఇటీవల ఎన్నికల్లో గెలిపించాయని బిజెపి శ్రేణులు, అభిమానులు పేర్కొన్నారు.
ఇదిలావుంటే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలోని బత్తువాని పల్లి గ్రామానికి ఈటల మొదటిసారి విచ్చేసారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కరిస్తానని ఈటల గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
ఇదిలావుంటే బిజెపి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈటల దూకుడు పెంచారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ను ఎదిరించి హుజురాబాద్ లో విజయం సాధించి బిజెపి అధిష్టానం దృష్టిలో పడ్డారు. దీంతో ఆయనకు బిజెపి సముచిత స్థానం కల్పించనుందని ప్రచారం జరిగింది. తెలంగాణ బిజెపి ప్రచార కమిటీ బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది.
read more కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈటల ఎఫెక్ట్... టీఆర్ఎస్ అలర్ట్, క్యాంప్ రాజకీయాలు షురూ
ఇక ఇటీవల ఈటల రాజేందర్ ప్రముఖ ఆద్యాత్మికవేత్త రవిశంకర్ గురూజీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మానసగంగ ఆశ్రమానికి ravishankar guruji విచ్చేయగా ఆయనను eatala rajender మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈటెలలతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి కూడా రవిశంకర్ గురూజీతో దాదాపు గంటసేపు భేటీఅయ్యారు. ఈ భేటీపై ప్రజల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.