షటిల్ ఆడుతూ కోర్ట్ లోనే కుప్పకూలి... గుండెపోటుతో జగిత్యాలవాసి మృతి (వీడియో)

Published : Jun 02, 2023, 03:37 PM IST
షటిల్ ఆడుతూ కోర్ట్ లోనే కుప్పకూలి... గుండెపోటుతో జగిత్యాలవాసి మృతి (వీడియో)

సారాంశం

షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కోర్ట్ లోనే కుప్పకూలి చనిపోయాడు జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి. 

జగిత్యాల : మారుతున్న అహార అలవాట్లో, జీవనవిధానమో లేక మరేదైనా కారణమో తెలీదుగానీ ఇటీవల గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య పెరిగింది. ఒకప్పుడు పెద్దవయసులో వున్నవారు మాత్రమే గుండెపోటుకు గురయ్యేవారు కానీ ఇప్పుడు చిన్నా పెద్ద, ఆడ మగ తేడా లేదు... వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నారు. స్కూల్ కు వెళ్ళే చిన్నారుల నుండి యువత, నడివయస్కులు, వృద్దుల వరకు గుండెపోటుకు గురవుతున్నారు. రోడ్లపై నడుచుకుంటూ, జిమ్ లో కసరత్తులు చేస్తూ, గ్రౌండ్ లో ఆడుకుంటూ, ఆఫీసులో, ఇళ్లలో... ఎక్కడపడితే అక్కడ సడన్ గా హార్ట్ స్ట్రోక్ తో కుప్పకూలి చనిపోతున్నవారి సంఖ్య రోజురోజులు పెరుగుతోంది. తాజాగా జగిత్యాలలో ఇలాంటి మరణమే సంబవించింది. 

జగిత్యాల పట్టణానికి చెందిన బూస వెంకటరాజ గంగారం రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయంకూడా వాకింగ్ కు వెళ్లాడు. కొద్దిసేపు వాకింగ్ అనంతరం స్థానిక క్లబ్ తోటి సభ్యులతో కలిసి సరదాగా షటిల్ ఆడాడు. ఇలా షటిల్ ఆడుతూనే ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు అతడిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే అతడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. 

వీడియో

ఈ విషాద ఘటనపై పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఉదయం వాకింగ్ అని వెళ్లిన వ్యక్తి ఇలా మృతదేహంగా తిరిగివస్తుండటం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గాంగారం మృతదేహంవద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu