రేవంత్ రెడ్డి మాదిరిగా పార్టీలు మారడం చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Published : Jun 02, 2023, 02:50 PM ISTUpdated : Jun 02, 2023, 04:12 PM IST
 రేవంత్ రెడ్డి మాదిరిగా  పార్టీలు మారడం  చేతకాదు: బండి సంజయ్  సెటైర్లు

సారాంశం

రేవంత్ రెడ్డిపై  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విమర్శలు  చేశారరు. ఇవాళ   బండి సంజయ్  చిట్ చాట్  చేశారు.  

హైదరాబాద్: రేవంత్ రెడ్డి మాదిరిగా  పార్టీలు మారడం తను చేతకాదని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చెప్పారు.శుక్రవారంనాడు  బండి సంజయ్  హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో  బండి సంజయ్ మీడియా ప్రతినిధులతో  చిట్ చాట్  చేశారు.  ఓటుకు  నోటు కేసులో  డబ్బు సంపాదించడం చేతకాదన్నారు. రేవంత్ రెడ్డి  పార్టీని ఎలా నడుపుతున్నారో    జగ్గారెడ్డి,  జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని  అడిగితే  తెలుస్తుందన్నారు.కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో  అందరికి తెలుసునన్నారు. స్వంత  పార్టీ నేతలపై  విమర్శలు చేయడం తనకు చేతకాదని  రేవంత్ రెడ్డి పై  బండి సంజయ్  విమర్శలు  చేశారు. 

హుజూరాబాద్ , దుబ్బాక, జీహెచ్ఎంసీ  , ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని  ఆయన గుర్తు  చేశారు.  పార్టీ నడపకుంటే ఎలా గెలుస్తామని  ఆయన  ప్రశ్నించారు. బీజేపీలో  సీనియర్ లే బాస్ లు , కాంగ్రెస్ లో వారు హోంగార్డులని  ఆయన ఎద్దేవా  చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉనికే  లేదని  నిన్న  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై  బండి  సంజయ్ స్పందించారు.  బీజేపీ ఎక్కడుందో  కేటీఆర్ తన  తండ్రిని అడగాలని  సూచించారు.తమది కుటుంబ పార్టీ కాదన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో  ఓవైసీ  పాల్గొనలేదని  ఆయన  చెప్పారు.  ఈ విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech