హైదరాబాద్‌లో పంది కొవ్వుతో వంట నూనె తయారు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లకు విక్రయం..!!

Published : Jun 29, 2023, 12:34 PM IST
హైదరాబాద్‌లో పంది కొవ్వుతో వంట నూనె తయారు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లకు విక్రయం..!!

సారాంశం

హైదరాబాద్‌లో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. తాజాగా పంది కొవ్వుతో వంట నూనె తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటుమాడుతున్న వ్యక్తిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. తాజాగా పంది కొవ్వుతో వంట నూనె తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటుమాడుతున్న వ్యక్తిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. నేరెడ్‌మెట్‌ పీఎస్‌ పరిధిలోని ఆర్కే పురంలో నివాసం ఉంటున్న రమేష్ శివ అనే వ్యక్తి పంది కొవ్వును సేకరించి నూనె తయారు చేస్తున్నాడు. పంది మాంసం విక్రయించే షాపుల నుంచి పంది కొవ్వును కొనుగోలు చేసి.. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో నకిలీ నూనె తయారు చేస్తున్నాడు. కొవ్వును వేడి  చేసి.. అందులో ప్రమాదకర రసాయనాలు కలపడం ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాడు. 

ఇలా తయారుచేసిన ప్రమాదకర నూనెను రోడ్డు పక్కన ఉండే ఫ్రైడ్‌రైస్ దుకాణాలకు సప్లై చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు.. సోదాలు నిర్వహించి రమేష్ శివను అదుపులోకి తీసుకున్నారు. పంది కొవ్వు నుంచి తీసిన 15 లీటర్ల ఆయిల్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్‌ను వంటనూనెలో కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Also Read: టీ బీజేపీలో జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం.. ఆ ట్రీట్‌మెంట్ కావాలంటూ వీడియో పోస్టు.. కాసేపటికే..

రమేష్ దగ్గర నుంచి పంది  కొవ్వుతో తయారుచేసిన నూనెను కొనుగోలు చేస్తున్నవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం వెలుగుచూడటంతో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో విక్రయించే ఆహారం తినాలంటే జనాలు భయపడిపోతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?