అదిలాబాద్ జిల్లాలో ఓ ఆదివాసీ యాచకురాలైన మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు దుండగులు.
ఆదిలాబాద్ : తెలంగాణలోని అదిలాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఆదివాసీ మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఆమె యాచిస్తూ, తన కొడుకును చదివించుకుంటుంది. ఆమెను బలవంతంగా లాక్కెళ్లిన దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు.
దీంతో ఆదివాసీలు నిరసన చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని, బాధితురాలి కొడుకుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఐటీడీఏ ముందు ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇంద్రవెళ్లి మండలంలో ఈ ఘటన కలకలం రేపింది. నిందితులు ఆమెను లాక్కెళుతుండడం సీసీటీవీల్లో నమోదయ్యిందని..దీనిమీద న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.