తెలుగు అకాడమీ నిధుల స్కామ్: తవ్వుతున్న కొద్దీ.... మరో గోల్ మాల్ వెలుగులోకి..

By telugu teamFirst Published Oct 1, 2021, 7:31 AM IST
Highlights

తెలుగు అకాడమీలో తవ్వుతున్న కొద్దీ మరిన్ని ఆర్థిక అక్రమాలు బయపడుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. చందానగర్ కెనరా బ్యాంకులో రూ.8 కోట్ల గోల్ మాల్ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

హైదరాబాద్: తవ్వుతున్న కొద్దీ తెలుగు అకాడమీ నిధుల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు అకాడమీ ఆర్థిక వ్యవహారాల్లో మరో గోల్ మాల్ బయటపబడింది. హైదరాబాదులోని చందానగర్ కెనరా బ్యాంకులో 8 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్లు బయటపడింది. దీనిపై కెనరా బ్యాంక్ చందానగర్ బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇప్పటి వరకు 63 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు మాయం కాగా, తాజా సంఘటనతో అది 71 కోట్ల రూపాయలకు చేరుకుంది. తెలుగు అకాడమీ గోల్ మాల్ వ్యవహారంపై ఇప్పటికే అధికారులు విచారణను వేగవంతం చేశారు. పోలీసులు కూడా మరో వైపు విచారణ చేపట్టారు. తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డితో పాటు మరో అధికారిని పోలీసులు విచారించారు. 

Also Read: సంతోష్‌నగర్ బ్యాంకు నుండి రూ. 8 కోట్లు మాయం: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై మరో ఫిర్యాదు

తెలుగు అకాడమీకి చెందిన నిధులను విజయవాడలోని మర్కంటైల్ బ్యాంకుకు, హైదరాబాదులోని అగ్రసేన్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ కు బదిలీ అయినట్లు బయటపడింది. ఈ మూడు బ్యాంకుల నుంచి నిధులు ఓ వ్యక్తి ఖాతాలోకి బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు అకాడమీ 34 బ్యాంకుల్లో తన నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ గా పెట్టింది. వాటిలో ఇప్పటి వరకు 71 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు మాయమై, బ్యాలెన్స్ జీరో అయింది. 

మిగతా బ్యాంకుల్లో ఏం జరిగిందనే విషయంపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు తెలుగు అకాడమీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ నుంచి 8 కోట్ల రూపాయలు మాయమైనట్లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందింది. 

తాము యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు బ్యాంకు ఖాతాలో లేవని తొలుత తెలుగు అకాడమీ అధికారులే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్టు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబపు, జెడీ యాదగిరిలతో కూడిన కమిటీని నియమించింది. అక్టోబర్ 2వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. 

కమిటీ నివేదిక ఇవ్వాల్సిన గడవు మరో రోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో మరో గోల్ మాల్ వ్యవహారం వెలుగు చూసింది. మొత్తంగా తెలుగు అకాడమీ నిధులను పెద్ద మొత్తంలో స్వాహా చేసినట్లు అర్థమవుతోంది.

click me!