Nizamabad Gang Rape : బిర్యానీ తినిపించి, మద్యం తాగించి.. 6 మంది అత్యాచారం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు...

Published : Oct 01, 2021, 07:26 AM ISTUpdated : Oct 01, 2021, 07:28 AM IST
Nizamabad Gang Rape : బిర్యానీ తినిపించి, మద్యం తాగించి.. 6 మంది అత్యాచారం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు...

సారాంశం

 ఆమెకు బిర్యాని తినిపించడం తోపాటు మభ్య పెట్టి మద్యం తాగించారు.  అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మరమ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి  ఓ ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అయితే, అక్కడ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డు ఇది గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు  వాగ్వాదానికి  దిగారు.

నిజామాబాద్ దళిత విద్యార్థిని(Dalit Student)పై లైంగిక దాడి ఘటనలో ఆరుగురుని అరెస్ట్ (Six Arrest) చేసి, రిమాండ్ కు తరలించినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు.  సామూహిక అత్యాచారం కేసు (Nizamabad Gang Rape)వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ కు చెందిన నవీన్ కుమార్ కు బాధిత విద్యార్థిని తో పరిచయం ఉంది.  మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలిసి ఆమెను తీసుకుని నగర శివారు తో పాటు అంకాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు.

అక్కడ ఆమెకు బిర్యాని తినిపించడం తోపాటు మభ్య పెట్టి మద్యం తాగించారు.  అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మరమ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి  ఓ ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అయితే, అక్కడ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డు ఇది గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు  వాగ్వాదానికి  దిగారు.

దీనితో సెక్యూరిటీ గార్డు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి విద్యార్థిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్ తో పాటు,  గంజి చంద్ర శేఖర్,  తుమ్మ భాను ప్రకాష్, ఫిర్యాదు చరణ్, షేక్ కరీం, పి గంగాధర్ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.  ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.  వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. 

Nizambad gang Rape: ముగ్గురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు

కాగా, నిజామాబాద్ నగరంలో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించదన్నారు.  24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలియజేశారు. 

సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదు అన్నారు. నిజామాబాద్ లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తాం.. అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.