హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య.. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని లేఖ..

Published : Jan 10, 2023, 11:28 AM IST
హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య.. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని లేఖ..

సారాంశం

ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. రైలు కింద పడి బలవన్మరణం చెందాడు.

ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ప్రేమించిన అమ్మాయి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అవసరానికి డబ్బులు ఇస్తే ప్రైవేట్ రిలేషన్ షిప్‌లో ఉందామని యువతి చెప్పిందని లేఖలో పేర్కొన్నాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే తన కుటుంబంపై కేసు పెట్టిందని కూడా చెప్పాడు. తనవల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తెలిపాడు. అయితే యవకుడు ఆత్మహత్య చేసుకోలేదని.. ఎవరో హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల విజయవాడలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాను ఓ యువతిని ప్రేమించి మోసపోయానని విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌ నోట్‌లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు. ఆ యువతి చేతిలో తనలా మోసపోయిన వారికి న్యాయం చేయవాలని కోరాడు. వివరాలు.. బీటెక్ చదువుతున్న అబ్దుల్ సలామ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. ఓ యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. ప్రియురాలి మోసాన్ని భరించలేక తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పారు. 

ఆమె తప్పుడు ప్రేమతో తాను పిచ్చివాడయ్యానని.. జీవితంపై విరక్తి చెందానని చెప్పాడు. ఆమె తనతో ప్రేమలో ఉన్నట్లు నటిస్తోందని.. పెళ్లయిన లెక్చరర్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తోందని లేఖలో పేర్కొన్నాడు. రాత్రి వేళల్లో ఆమె వేరొకరితో వీడియో కాల్స్ చేసిందని ఆరోపించాడు. ఆమె ప్రవర్తనను మార్చేందుకు ఎంతగా ప్రయత్నించిన మారలేదని పేర్కొన్నాడు. ఆమె చేతిలో మోసపోయిన అమాయక కుర్రాళ్లకు న్యాయం చేయాలని అబ్దుల్ సలామ్ లేఖలో రాశాడు. ఇక, ఈ ఘటనపై ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు