నకిలీ చలాన్లతో మద్యం దుకాణాలకు టెండర్లు: 11 మందిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు

By narsimha lode  |  First Published Jan 10, 2023, 10:29 AM IST

మద్యం దుకాణాలకు  టెండర్లు దాఖలు చేసే సమయంలో  నకిలీ చలాన్లు సమర్పించిన  11 మందిని పోలీసులు అరెస్ట్  చేశారు. వరంగల్  రూరల్ జిల్లాలోని వర్ధన్నపేటలో  ఈ ఘటన చోటు  చేసుకొంది. 


వరంగల్: మద్యం  షాపుల టెండర్ల దాఖలు సమయంలో నకిలీ చలాన్లు  సమర్పించిన  కేసులో  11 మందిని పోలీసులు అరెస్ట్  చేశారు.  ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది.   కోటి రూపాయాలకు  పైగా నకిలీ చలాన్లను  పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో  బ్యాంకు  క్యాషియర్ ను కూడా పోలీసులు అరెస్ట్  చేశారు.

వరంగల్ రూరల్  జిల్లాలోని  వర్ధన్నపేటలో   ఈ వ్యవహరం వెలుగు చూసింది.  ప్రతి రెండేళ్లకోసారి  మద్యం దుకాణాలకు టెండర్లను పిలుస్తారు.  ఈ టెండర్లలో అత్యధిక ధర కోట్ చేసిన వారికి  మద్యం దుకాణాలు  కేటాయిస్తారు. 2021 జనవరి మాసంలో  ఈ విషయం వెలుగు చూసింది.  నకిలీ  చలాన్లను  ఎక్సైజ్ శాఖకు సమర్పించిన విషయమై  అధికారుల దృష్టికి వచ్చింది.  దీంతో  ఎక్సైజ్ శాఖ సీఐ  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు  నిర్వహించారు. 

Latest Videos

undefined

నకిలీ చలాన్లు సమర్పించిన  మద్యం దుకాణాలను  అప్పట్లోనే  సీజ్  చేశారు.  మద్యం  దుకాణాల  యజమానులతో పాటు బ్యాంకులో  క్యాషియర్ గా  పనిచేసే  వ్యక్తి కూడా  ఇందుకు సహకరించినట్టుగా  పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో  11 మందిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.  

బ్యాంకులో  డబ్బులు జమ చేయకుండానే  బ్యాంకు ఉద్యోగుల సహకారంతో  రశీదులపై స్టాంప్ వేయించి  ఎక్సైజ్  అధికారులకు  అప్పట్లో  సమర్పించారు.  ఈ విషయాన్ని ఆలస్యంగా  ఎక్సైజ్ అధికారులు  గుర్తించారు.  ఈ కేసును పోలీసులు విచారించారు. నకిలీ చలాన్ల  కేసుతో  సంబంధం ఉన్న  11 మందిని అరెస్ట్  చేశారు.

click me!