6.67 లక్షల కరెంట్ బిల్లు: నా ఇల్లు అమ్మేసి తీసుకోండి.. అధికారులకు సామాన్యుడి ఆఫర్

By Siva KodatiFirst Published Jul 28, 2020, 7:24 PM IST
Highlights

తెలంగాణలో కరెంట్ బిల్లులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలకు కరెంట్‌తో కాదు బిల్లు చూస్తేనే షాక్ తగులుతోంది

తెలంగాణలో కరెంట్ బిల్లులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలకు కరెంట్‌తో కాదు బిల్లు చూస్తేనే షాక్ తగులుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ సామాన్యుడికి ఏకంగా ఆరున్నర లక్షల కరెంట్ బిల్లు వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్ పటేల్ నగర్‌లో వున్న వీరబాబుకు నాలుగు నెలల కరెంట్ బిల్లు ఏకంగా రూ.6.67 లక్షలు వచ్చింది. దీంతో ఖంగుతిన్న బాధితుడు తన ఇంటిని అమ్మేసి బిల్లు చెల్లించి మిగిలిన డబ్బులు ఇవ్వాలని అధికారులను కోరాడు.

తనకు ఆధార్ కార్డ్, లేబర్ కార్డ్ అన్ని ఉన్నాయని.. కానీ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ నుంచి రాలేదని చెప్పాడు. ఏమైనా చెద్దామంటే పని కూడా దొరకడం లేదని వీరబాబు చెప్పాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు సైతం వారి సొంత గ్రామాలకు వెళ్లిపోయారని.. సుమారు 5 నెలల నుంచి వాళ్లు కూడా అద్దె చెల్లించలేదని వాపోయాడు. 

Also Read:మా వీధిలోని అందరి కరెంట్ బిల్లు నాకే వేసారా?
 

click me!