తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యురాలు: పెంచుతానని తీసుకెళ్లి... వ్యభిచార గృహంలోకి...

Siva Kodati |  
Published : Jul 28, 2020, 05:16 PM ISTUpdated : Jul 28, 2020, 05:22 PM IST
తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యురాలు: పెంచుతానని తీసుకెళ్లి... వ్యభిచార గృహంలోకి...

సారాంశం

తల్లిదండ్రులను కోల్పోయిన అమ్మాయి ఆలనా పాలనా చూస్తూ ఆమెకు అండగా నిలవాల్సిందిపోయి ఆ అబాగ్యురాలిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని చూశాడో కేటుగాడు

తల్లిదండ్రులను కోల్పోయిన అమ్మాయి ఆలనా పాలనా చూస్తూ ఆమెకు అండగా నిలవాల్సిందిపోయి ఆ అబాగ్యురాలిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని చూశాడో కేటుగాడు. వ్యభిచార గృహానికి అమ్మేయడంతో ఆ యువతిని పోలీసులు రక్షించారు.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన 20 సంవత్సరాల యువతి తల్లిదండ్రులు మృతిచెందారు. ఈ సమయంలో ఆ యువతిని చదివించి తీర్చిదిద్దుతామని మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి తీసుకెళ్లారు.

Also Read:తల్లి రెండో పెళ్లి.. అన్న ఇంటికి వెళితే.. వదిన కాలనాగులా..

అనంతరం ఆ యువతిని అమ్మేశారు. ఎన్నిరోజులు గడిచినా ఆ యువతి ఇంటికి రాకపోవడంతో బంధువులు బెల్లంపల్లి పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో ఇటీవల బాధితురాలు తన మామయ్యకు ఫోన్ చేసి తాను సిరిసిల్లలో ఉన్నట్లు సమాచారం అందించింది. దీంతో అతను పోలీసులకు విషయం చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు సిరిసిల్ల ప్రేమ్ నగర్‌లోని వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి, బాధిత యువతిని రక్షించారు. 
 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu