వరవరరావు ఆరోగ్యంపై మూడు రోజుల్లో నివేదిక: నానావతి ఆసుపత్రికి ముంబై హైకోర్టు ఆదేశం

Published : Jul 28, 2020, 06:07 PM IST
వరవరరావు ఆరోగ్యంపై మూడు రోజుల్లో నివేదిక: నానావతి ఆసుపత్రికి ముంబై హైకోర్టు ఆదేశం

సారాంశం

మూడు రోజుల్లో విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ముంబై హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది.ముంబైలోని నానావతి ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నాడు. భీమా కోరేగాం కేసులో ఆయన తలోజా జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.  


ముంబై: మూడు రోజుల్లో విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ముంబై హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది.ముంబైలోని నానావతి ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నాడు. భీమా కోరేగాం కేసులో ఆయన తలోజా జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.

వరవరరావు ఆరోగ్య పరిస్థితులపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ  తరుణంలో ముంబై  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా కూడ చివరి ఆసుపత్రికి తరలించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాదిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించిన తర్వాత తలోజా జైలు నుండి నానావతి ఆసుపత్రికి తరలించారు.

also read:విరసం నేత వరవరరావుకు కరోనా: ఆందోళనలో కుటుంబసభ్యులు

వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ ఏడాది ఆగష్టు 7వ తేదీకి వాయిదా వేసింది.

విరసం నేత వరవరరావుకు కరోనా సోకిందని వైద్యులు ప్రకటించారు. తలోజా జైలులో రిమాండ్ లో ఉన్న వరవరరావును జేజే ఆసుపత్రిలో చేర్పించారు జైలు అధికారులు.

కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును  2018 ఆగష్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వరవరరావు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 81 ఏళ్ల వరవరరావుకు  ఈ నెల 16వ తేదీన కరోనా సోకింది. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే