హైదరాబాద్‌లో దారుణం.. నడ్డిరోడ్డుపై మహిళపై కత్తితో దాడి.. భయంతో వణికిపోయిన స్థానికులు..

Published : Jan 11, 2022, 07:54 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. నడ్డిరోడ్డుపై మహిళపై కత్తితో దాడి.. భయంతో వణికిపోయిన స్థానికులు..

సారాంశం

హైదరాబాద్ (Hyderabad) ఎర్రగడ్డలో దారుణం చోటుచేసుకుంది. నడ్డిరోడ్డుపై ఓ వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించారు. 


హైదరాబాద్ (Hyderabad) ఎర్రగడ్డలో దారుణం చోటుచేసుకుంది. నడ్డిరోడ్డుపై ఓ వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వివరాలు..  ఎర్రగడ్డలోని (Erragadda) శంకర్‌ లాల్ నగర్‌లో 35 ఏళ్ల బాధిత మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్తను విడిచి పెట్టి ఒంటరిగా జీవనం సాగిస్తుంది. అయితే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఉంటున్న ఖలీల్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టకుంది. అయితే కొంతకాలంగా ఆమె ఖలీల్‌ను దూరం పెట్టింది. 

దీంతో ఆ మహిళపై ఖలీల్‌ కక్ష పెంచుకున్నారు. ఆమెపై దాడి చేసేందకు ప్లాన్ చేసుకున్నాడు. మంగళవారం ఆ మహిళ గౌతమ్‌పూరి కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అయితే ఈ ఘటనను చూసిన స్థానికులు భయపడిపోయారు. దాడి తర్వాత మహిళ మరణించిందని భావించిన ఖలీల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఖలీల్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళపై దాడికి పాల్పడిన ఖలీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tomato Price : టమాటా ధరలు ఢమాల్.. హైదరాబాద్ లో కిలో ధర ఎంతో తెలుసా?
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధ‌ర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వ‌రుల‌య్యేవారు