కొద్ది రోజుల తరువాత బెయిల్ మద బైటికి వచ్చాడు. తనను జైలుకు పంపారన్న కోపంతో.. సహజీవనం చేసిందన్న కనికరం కూడా లేకుండా, ఆమె మెడను కత్తితో కోసి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. నగరంలోని కుప్పురావుకాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
మంగళగిరి : భర్త వదిలేసిన ఓ మహిళను చేరదీశాడు. పద్దెనిమిదేళ్లు సహజీవనం చేశాడు. కానీ ఆ తరువాతే అతని బుద్ది వక్రించింది. డిగ్రీ చదువుతున్న ఆమె కూతురు పై కన్నేశాడు. అతడు దురుద్దేశం గ్రహించిన తల్లీకూతుళ్లు కామాంధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ ప్రబుద్ధడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
అంతటితో అతడికి బుద్ది వస్తే సమస్యే లేకపోయేది. కానీ అలా జరగలేదు. కొద్ది రోజుల తరువాత బెయిల్ మద బైటికి వచ్చాడు. తనను జైలుకు పంపారన్న కోపంతో.. సహజీవనం చేసిందన్న కనికరం కూడా లేకుండా, ఆమె మెడను కత్తితో కోసి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. నగరంలోని కుప్పురావుకాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం మేరకు.. నగరానికి చెందిన ఓ మహిళ (42)ను భర్త వదిలేశాడు. ఆమె తన కొడుకు, కూతురు తో కలిసి కుప్పురావుకాలనీలో ఉంటుంది. ఆమెతో పరిచయం పెంచుకున్న గోలి సాంబయ్య గత 18 యేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆ మహిళ కుమార్తె డిగ్రీ చదువుతుంది. ఆమె పై కన్నేసిన సాంబయ్య లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
‘సగం చంపాను.. క్షుద్రపూజ చేసి శవాన్ని బతికిస్తా..’ జగిత్యాలలో కలకలం, దంపతుల అరెస్ట్..
జూన్ 29న తో కలిసి ఉండాలని వేధించడంతో అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని, తనతో సంబంధం పెట్టుకోవాలని శారీరకంగా వేధిస్తున్నాడంటూ తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. అడ్డు వచ్చిన తన అన్న మీద కూడా దాడి చేశాడని తెలిపింది. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలు నుండి ఇటీవల బెయిల్పై వచ్చాడు.
తనను జైలుకు పంపారని కక్ష పెంచుకున్న సాంబయ్య.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మహిళ ఇంటికి వెళ్ళాడు. మొదట కత్తితో ఆమె నుదుటిపై గాయం చేశాడు. తర్వాత మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత కాలంలో అందరూ చూస్తుండగానే పారిపోయాడు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్సై నారాయణ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు నమోదు చేసుకున్నారు.