24 గంటల్లో 427 మందికి పాజిటివ్... తెలంగాణలో 6,51,715కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Aug 13, 2021, 09:48 PM IST
24 గంటల్లో 427 మందికి పాజిటివ్... తెలంగాణలో  6,51,715కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 427 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 609 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 7,812 యాక్టివ్‌ కేసులు వున్నాయి  

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 427 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 6,51,715కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 3,838కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 609 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,40,065కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 7,812 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 16, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 2, కామారెడ్డి 2, కరీంనగర్ 43, ఖమ్మం 23, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 6, మంచిర్యాల 15, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 28, ములుగు 4, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 26, నారాయణపేట 2, నిర్మల్ 0, నిజామాబాద్ 6, పెద్దపల్లి 22, సిరిసిల్ల 15, రంగారెడ్డి 21, సిద్దిపేట 13, సంగారెడ్డి 3, సూర్యాపేట 14, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్