బావమరిది మీద కోపం.. నిండుగర్బిణీ భార్యను వేటకొడవలితో నరికి చంపిన వ్యక్తి...

By Bukka SumabalaFirst Published Sep 14, 2022, 9:19 AM IST
Highlights

బావమరిది మీద కోపంతో అతని భార్యను నిండు గర్భిణీ అని కూడా చూడకుండా.. వేటకొడవలితో నరికి చంపాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ : భార్య తనపై కేసు పెట్టడానికి కారణం అతనే అని.. అతడిని చంపాలని భావించిన ఓ వ్యక్తి.. ఆ సమయానికి అతడు లేకపోవడంతో ఇంట్లో ఉన్న నిండు గర్భిణీని వేటకొడవలితో నరికి చంపాడు. హైదరాబాదులోని గచ్చిబౌలి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన వి. వెంకట రామకృష్ణ తన భార్య వాసంశెట్టి స్రవంతి (32)తో కలిసి కొంతకాలం హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వీరికి పదేళ్ల కూతురు చైత్ర ఉంది. ప్రస్తుతం స్రవంతి 8 నెలల గర్భిణీ.

2020లో తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు పశ్చిమ గోదావరి జిల్లా  మొగల్తూరు మండలం పేరుపాలానికి చెందిన కావూరు శ్రీ రామకృష్ణ (35)తో పెళ్లి చేయించడంలో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించాడు. కొంతకాలం తర్వాత  అదనపు కట్నం కోసం వారు వేధించడం ప్రారంభించడంతో..  లక్ష్మీప్రసన్న తన పుట్టింటి వాళ్లకు ఈ విషయం చెప్పింది. దీంతో వెంకట రామకృష్ణ చెల్లెలికాపురం సరిదిద్దే ప్రయత్నం చేసినా.. శ్రీరామకృష్ణ వినలేదు. ఇదే విషయంగా నిరుడు పేరుపాలెంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. చర్చలు విఫలం కావడంతో లక్ష్మీప్రసన్న హైదరాబాదులో పుట్టింటికి వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది.

తేలు కాటుతో బీటెక్ విద్యార్థిని మృతి.. సిరిసిల్లలో విషాదం...

నెల క్రితం భర్త, అత్తింటి వారిపై ఆమె చందానగర్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీ రామకృష్ణకు నోటీసులు జారీ చేశారు. దీనంతటికీ వెనక రామకృష్ణ దంపతులే ఉన్నారని వారి పేరు శ్రీ రామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. బావమరిదిని హత్య చేయాలని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎర్రగడ్డలో వేట కొడవలి కొని.. ఈ నెల 6న కొండాపూర్లో బావమరిది ఇంటికి వెళ్ళాడు.  ఆ సమయంలో వెంకట రామకృష్ణ తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకు వచ్చేందుకు బయటికి వెళ్లాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి శ్రీరామకృష్ణ చేతిలో వేట కొడవలి చూసి కేకలు వేస్తూ.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ,  శ్రీ రామకృష్ణ, నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం, భుజం మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.  రక్తపు మడుగులో పడివున్న బాధితురాలి కేకలు విని పక్కింటి వారు వచ్చి ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి చెందింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి.. అరెస్టు చేసి, రిమాండ్కు  తరలించినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు. 

click me!