సాయం చేసిన స్నేహితుడినే అంతమొందించాడు... తనతోనే గుంతతీయించి, పూడ్చి పెట్టాడు..

Published : Sep 14, 2022, 07:28 AM IST
సాయం చేసిన స్నేహితుడినే అంతమొందించాడు... తనతోనే గుంతతీయించి, పూడ్చి పెట్టాడు..

సారాంశం

స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని సాయం చేశాడు. ఆ తరువాత అప్పు తీర్చమన్నాడు. దీంతో కోపం పెంచుకున్న స్నేహితుడు అతడిని అంతమొందించాడు.

పటాన్ చెరు : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.  సాయం చేసిన స్నేహితుడినే అతి కిరాతకంగా అంతమొందించిన  ఘటన పటాన్ చెరు ఠాణా పరిధిలో జరిగింది. డిఎస్సి భీమ్ రెడ్డి,  సీఐ వేణుగోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గౌతమ్ నగర్ కాలనీకి చెందిన ఆర్టీసీ విజిలెన్స్ మాజీ ఉద్యోగి సలీం. ఆయన కుమారుడు మహ్మద్ సమీర్ అహ్మద్ (28), భానూరు మటన్ దుకాణంలో పనిచేస్తున్న షేక్ ఇలియాస్, అతని సహాయకుడు రుస్తుం అలీ, మియాపూర్ లో అడ్డా కూలీగా పనిచేస్తున్న అల్లావుద్దీన్.. ముగ్గురూ స్నేహితుడు. ఇలియాస్ ఇబ్బందుల్లో ఉన్నాడని సమీర్ తన తండ్రికి చెప్పి వారి ఇంట్లో ఉంటున్న మాణిక్ రెడ్డి వద్దనుంచి రూ.50వేలు ఇప్పించాడు.

మూడు నెలల్లో డబ్బులు చెల్లిస్తానని ఇలియాస్ చెప్పాడు. అలా ఇవ్వకపోవడంతో నలుగురి ముందు సమీర్ గట్టిగా అడగడం మొదలుపెట్టాడు. దీన్ని అవమానంగా భావించిన ఇలియాస్.. తన బావమరిది  రుస్తుం అలీ, స్నేహితుడు  అల్లావుద్దీన్ తో కలిసి  సమీర్ ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. ఈనెల 8న  మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటూ పటాన్చెరువు శివారులో ఇద్దరు కూలీలతో గుంత తవ్వించారు. ఇదే విషయాన్ని సమీర్ కు చెప్పి అక్కడికి తీసుకువెళ్లి అదే గుంతని పెద్దగా తవ్వించారు. 

ఒత్తిడి భరించలేకే ఐఐటీ విద్యార్ధి రాహుల్ సూసైడ్: సంగారెడ్డి ఎస్పీ

మర్నాడు ఉదయం ఇలియాస్.. సమీర్ కు ఫోన్ చేసి నిన్న మృతదేహం రాలేదు. తవ్విన గుంతను పూడ్చేద్దామని మళ్ళీ పిలిచారు. అతను రాగానే గుంతలోకి చూస్తున్నట్టు నటిస్తూ సమీర్ తలపై అల్లాఉద్దీన్ ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. సమీర్ గుంతలో పడిపోగా ఇలియాస్ 4 గ్రానైట్ రాళ్లను అతని మీద పడేసాడు. రుస్తుం అలీతో కలిసి మిగతా ఇద్దరు మట్టి పోసి  పూడ్చేశారు. తన కుమారుడి ఆచూకీ కోసం సలీం అడగగా..  ఇలియాస్ అనుమానాస్పదంగా సమాధానమిచ్చాడు. దీంతో అతను పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. అల్లాఉద్దీన్ పరారీలో ఉన్నాడు.

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లో జూలైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడిని హతమార్చి, పాము కాటుతో చనిపోయాడని కలరింగ్ ఇవ్వాలనుకున్నాడు. దీనికోసం మృతదేహం పక్కన చనిపోయిన నాగుపామును పడేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రాజేష్ సింగ్ భదౌరియా తెలిపిన వివరాల్లోకి వెడితే... మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృతుడి స్నేహితుడు సందీప్ బాగ్మారే ఇంట్లో బస్సు డ్రైవర్ నవల్ సింగ్ మృతదేహం లభ్యమైంది. అంతేకాదు “శవం పక్కన చనిపోయిన నాగుపాము కూడా పడి ఉంది. సింగ్, అతని స్నేహితులు రాత్రిపూట కలిసి మద్యం సేవించారని బాగ్మారే చెప్పారు ”అని భదౌరియా చెప్పారు.

బాగ్‌మరే, సింగ్‌ కలిసి మద్యం తాగారు. అప్పటికే రాత్రి బాగా ఆలస్యం కావడంతో బాగ్మారే తన ఇంట్లో పడుకోమని సింగ్ ను కోరాడు. మరుసటి రోజు ఉదయం, బాగ్మారే తన స్నేహితుడు చనిపోయాడని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన బాగ్‌మారే ఇంటికి చేరుకున్నారు. అక్కడ మృతదేహం దగ్గర చనిపోయిన నాగుపాము పడి ఉండటాన్ని వారు గమనించారు. సింగ్ రాత్రిపూట పడుకున్నప్పుడు పాము కరవడం వల్ల మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానించారు. 

అయితే, కేసు దర్యాప్తులో భాగంగా, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ రిపోర్టులో మృతుడు పాము కాటు కారణంగా సింగ్ మరణించలేదని పోలీసులకు తెలిసింది. సింగ్ మృతికి పాము కాటు కారణం కాదని తెలిసింది. “మరణించిన వ్యక్తి శరీరంలో విషం లేదు. శరీరంపై పాము కాటుకు సంబంధించిన సంకేతాలు లేవు. నావల్ సింగ్ ఊపిరాడక చనిపోయాడని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది'' అని భదౌరియా తెలిపారు.

దీంతో అనుమానంతో బాగ్మారేను పోలీసులు ప్రశ్నించారు. అయితే, మొదట నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత సింగ్‌ నోటికి, ముక్కుకు గుడ్డ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగ్‌మారే ఒంటరిగా ఈ హత్య చేశాడా లేక మరెవరితో కలిసి చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ