యువతి స్నానం చేస్తుండగా దొంగతనంగా వీడియో చిత్రీకరణ.. యువకుడు అరెస్ట్...

Published : Sep 01, 2023, 11:41 AM IST
యువతి స్నానం చేస్తుండగా దొంగతనంగా వీడియో చిత్రీకరణ.. యువకుడు అరెస్ట్...

సారాంశం

యువతి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించాడో యువకుడు. సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతీ స్నానం చేస్తుండగా రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించాడో యువకుడు. విషయం పోలీసులకు తెలియడంతో అతనిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఎస్ ఆర్ నగర్  పోలీస్ ఇన్స్పెక్టర్  పివి రాంప్రసాదరావు దీని గురించి చెబుతూ… బుధవారం రాత్రి  ఎస్ ఆర్ నగర్ కు చెందిన ఓ యువతి (22) ఇంట్లోని స్నానాలు గదిలో స్నానం చేస్తోంది.

బాత్రూం వెంటిలేటర్ లో నుంచి ప్రశాంత్ (26) అనే యువకుడు  దొంగతనంగా సెల్ఫోన్లో ఆమె స్నానం చేసే వీడియోలు చిత్రీకరించాడు. ఇది యువతి కంటపడింది. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేసింది.  కేకలు విన్న ఆ యువకుడు వెంటనే అలర్ట్ అయి బాపూనగర్లోని ఓ హాస్టల్ లోకి పరిగెత్తి పారిపోయాడు. దీంతో బాధితురాలు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత యువతి ఫిర్యాదు మేరకు ప్రశాంత్ ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు