
అదిలాబాద్ : తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యను హత్య చేసిన ఓ భర్త పీఎస్ కు వెడుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదిలాబాద్ బంగారిగూడలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. బంగారిగూడలోని అరుణ్ అనే వ్యక్తి భార్య దీప మీద అనుమానంతో హత్య చేశాడు.
ఆ తరువాత పిఎస్ లో లొంగిపోవడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త అరుణ్ మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.