తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్... హైదరాబాద్ లో సిడబ్ల్యూసి భేటీ

Published : Sep 01, 2023, 07:53 AM IST
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్... హైదరాబాద్ లో సిడబ్ల్యూసి భేటీ

సారాంశం

తెలంగాణలో అధికాారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ జాతీయస్థాయి నాయకత్వాన్నంతా హైదరాబాద్ కు తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

హైదరాబాద్ : ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి జోరు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో సక్సెస్ ఫుల్ గా అధికారాన్ని చేజిక్కించుకుని ఊపుమీదున్న కాంగ్రెస్ తెలంగాణపై కన్నేసింది. తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా రెండుసార్లు గెలిచిన బిఆర్ఎస్ ను ఈసారి ఎలాగయినా ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.  

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ వర్కింగ్  కమిటీ (సిడబ్యూసి) మొదటి సమావేశం నిర్వహించాలని ఏఐసిసి నిర్ణయించింది. సెప్టెంబర్ 16న ఈ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీకోసం కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తో పాటు జాతీయస్థాయి కీలక నాయకులు హైదరాబాద్ రానున్నారు. ఈ భేటీలో పాల్గొనే నాయకులతో భారీ బహిరంగ సభకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభ ద్వారా ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశం వెనక రాష్ట్ర కాంగ్రెస్ మరో వ్యూహం వున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. దీన్ని విలీనంగా కాంగ్రెస్ పేర్కొంటుంటే, విమోచనంగా బిజెపి పేర్కొంటోంది. విలీనమో లేక విమోచన దినోత్సవమో గానీ ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులంతా హైదరాబాద్ లోనే వుండనున్నారు.కాబట్టి సోనియా గాంధీ ముఖ్య అతిథిగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది.  ఆ వేడుకల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాదు గతంలోనూ ఈ ప్రాంతాన్ని కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలకు వివరించే అవకాశం వుంటుందని ఆ పార్టీ భావిస్తోంది. 

Read More  Revanth Reddy: తుమ్మలతో రేవంత్ భేటీ.. ‘ఆయన రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలరు’

ఇక తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే మరో మూడు రాష్ట్రాలు చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ బలంగా వుంది. చత్తీస్ ఘడ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ అధికారంలో వుంది. మధ్య ప్రదేశ్ లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ విజయం సాధించి లోక్ సభ ఎన్నికలకు తాము సిద్దమేనని ఘనంగా ప్రకటించాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బలంగా వున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. 

అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ప్రత్యేకసమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుండి 22 వరకు అంటే ఐదురోజులు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సిడబ్ల్యూసి మీటింగ్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మీటింగ్ ను వాయిదా వేస్తారో లేక యధావిదిగా కొనసాగిస్తారో చూడాలి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్