
పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు (dalita bandhu) పేరిట లబ్ధిదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసే దళారులు, బ్రోకర్లు, మోసగాళ్ల తాటతీస్తానని, పోలీస్ కేసులు పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు. దళిత బంధు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే దళారులు, మోసగాళ్లు, బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విక్రమార్క సూచించారు. చింతకానిలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు ఇప్పించే బాధ్యత నాదేనని ఆయన హామీ ఇచ్చారు.
సిగ్గులేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచితే ప్రజలు కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా అని భట్టి ప్రశ్నించారు. ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపి నడ్డి విరుస్తుంటే ..ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని.. లేకుంటే ఉద్యమాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని విక్రమార్క హెచ్చరించారు. 5 వేలు రావాల్సిన కరెంట్ బిల్లు 96 వేలు వస్తే కట్టడం సాధ్యమేనా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను (electricity charges in telangana) ఉపసంహరించుకోవాలని.. లేకుంటే గత పాలకులకు పట్టిన గతే టిఆర్ఎస్ సర్కార్ కు పడుతుందని విక్రమార్క హెచ్చరించారు.
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన Mallu Bhatti Vikramarka మధిరలో తన పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ నెల 7వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ నెల 5వ తేదీ సాయంత్రానికి భట్టి వికరమార్క తన పాదయాత్రను నిలిపివేశారు.ఈ నెల 6వ తేదీన హైద్రాబాద్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు పాదయాత్రను ప్రారంభిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Madira నియోజకవర్గంలోని యడవల్లి గ్రామం నుండి భట్టి విక్రమార్క తన పాదయాత్రను ప్రారంభించారు. 33 రోజుల పాటు 135 గ్రామాల గుండా యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజల నుండి భట్టి విక్రమార్క ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలోనే భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించాలని భావించారు. కానీ కరోనా కారణంగా పాదయాత్రను భట్టి విక్రమార్క వాయిదా వేసుకొన్నారు. గురువారం నుండి ప్రారంభించిన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ అని నామకరణం చేశారు భట్టి విక్రమార్క. ప్రతి రోజూ 15 నుండి 20 కి.మీ దూరం భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగించారు.
గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ఎర్రుపాలెం అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజులు ముగించిన తర్వాత పాదయాత్రను ముగించనున్నారు.