
మల్కాజ్ గిరి సీపీఎస్ ఎస్సై తనను మోసం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదేళ్ల పాటు సహ జీవనం చేసి వదిలేశాడని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు తనకు పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నాడని, తనను రెండో భార్యగా ఉండాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం పోలీసు డిపార్టెమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన బాధిత యువతి ఈ ఘటనపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
TS EMCET 2022 : తెలంగాణ ఎంసెట్ వాయిదా.. ? అనూహ్య వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం.. !
ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాల పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రస్తుతం మల్కాజిగిరి సీసీఎస్ పోలీసు స్టేషన్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న ధరావత్ విజయ్‌కుమార్ గతంలో బాధిత యువతితో సహజీవనం చేశారు. ఆయన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన వ్యక్తి. వీరిద్దరికీ పదేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వీరద్దరిదీ ఒక సామాజికవర్గం. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని ఒప్పించాడు. వీరద్దరూ కలిసి హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ లో ఒకే ఇంట్లో ఉంటూ కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యారు. అయితే 2016లో విజయ్ కుమార్ కు సబ్ ఎన్స్ పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. దీంతో పెద్దలు కుదర్చిన వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాధిత యువతికి తెలియనివ్వలేదు. ఆమెకు కూడా నాలుగు సంవత్సరాల కిందట గవర్నమెంట్ జాబ్ వచ్చింది.
టీఆర్ఎస్‌లో ‘‘షిండే’’లు ఎందరో.. ఆ మాట వింటనే కేసీఆర్‌కు వెన్నులో వణుకు : బండి సంజయ్
బాధితురాలికి మిర్యాలగూడలో పోస్టింగ్ వచ్చింది. అయితే ఆమె అక్కడే డ్యూటీ చేస్తూ వీకెంట్ సమయంలో హైదరాబాద్ కు వచ్చి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల ఎస్సై కు కుమారుడు జన్మించాడు. దీంతో అతడికి పెళ్లి అయ్యిందని అసలు విషయం బాధితురాలికి తెలిసింది. కోపంతో విజయ్ కుమార్ ను ఇదేంటని ప్రశ్నించింది. అయినా కూడా అతడు సహజీవనాన్ని కొనసాగిద్దామని చెప్పాడు. ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దనీ, రెండో భార్యగా ఉండాలని సూచించాడు దీంతో ఆమె బాధడింది. అయినా వేధింపులకు గురి చేశాడు. ఆమెకు తీవ్రంగా ఒత్తిడి రావడంతో హైదరాబాద్ నుంచి తన ఊరికి వచ్చేసింది.
సైన్యంలోనేనా... ప్రభుత్వంలో యువరక్తం వద్దా, ముందు మోడీని తప్పించాలి : అగ్నిపథ్‌పై కేసీఆర్ స్పందన
కుటుంబ పెద్దలు ఆమెకు పెళ్లి చేయాలని అనుకున్నారు. దీని కోసం సంబంధాలు వెతకడం మొదలు పెట్టారు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తుల ఫోన్ నెంబర్లు సేకరించి వారితో మాట్లాడేవాడు. ఆమెకు, తనకు సంబంధం ఉందని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని, మీరు పెళ్లి చేసుకోకూడదని సూచించేవారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.