హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయడం లేదని.. చామల కిరణ్‌రెడ్డి పోటీ చేస్తాడని, ఆయనకు తాను కూడా మద్ధతిస్తున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్ధి పేరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని అలాంటప్పుడు పద్మావతి పేరు ఎలా ప్రకటిస్తారని రేవంత్ ప్రశ్నించారు. అటు తెలంగాణ ప్రభుత్వంపైనా ఆయన విరుచుకుపడ్డారు.
undefined
కనీసం 14 రోజుల చర్చ జరగకుండా ఆమోదించిన బడ్జెట్ చెల్లదని ఆయన అభిప్రాయపడ్డారు. శని, ఆదివారాల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ సభ పెట్టకూడదని రేవంత్ మండిపడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 30 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగేవని ఆయన గుర్తు చేశారు. అలాకాకుండా కేవలం 10 రోజులు బడ్జెట్‌పై చర్చ చెల్లదని రేవంత్ వ్యాఖ్యానించారు.
విద్యుత్‌పై చర్చ జరిగితే.. సభలో ఎవరూ లేరని కరెంట్ కొనుగోళ్ల అక్రమాలపై గవర్నర్‌కు నివేదిక ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. సీఎల్పీలో తాను కూడా సభ్యుడినేనని గవర్నర్ అప్పాయింట్‌మెంట్‌పై సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు.
నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్
హుజూర్‌నగర్ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో
హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్
టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్