సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్డు క్లోజ్... కేంద్ర మంత్రికి కేటీఆర్ రిక్వెస్ట్

By telugu teamFirst Published Sep 18, 2019, 1:51 PM IST
Highlights

తీవ్ర ఇబ్బందులకు గురైన కొందరు స్థానికులు ఈ విషయాన్ని వెంటనే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై  ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేసి మరీ కేటీఆర్ కి ట్యాగ్ చేశారు. రోడ్డు మూసివేయడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు కేటీఆర్ కి వివరించారు. దీంతో... ఆయన వెంటనే స్పందించారు.


తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.... కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో వాహనాల రాకపోకలను అధికారులు నిరాకరించారు. ఈ విషయంపై   నెటిజన్... మంత్రి కేటీఆర్ కి ఓ ట్వీట్ చేశారు. ఆ నెటిజన్ ట్వీట్ కి  స్పందించిన కేటీఆర్... వెంటనే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకువచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ఆర్మీ అధికారులు రోడ్లను మూసివేశారు. సోమవారం వరకు వాహనాల రాకపోకలను అనుమతి ఇచ్చిన మిలిటరీ అధికారులు... ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంగళవారం సాయంత్రం నుంచి రోడ్డును పూర్తిగా మూసివేశారు.

దీంతో తీవ్ర ఇబ్బందులకు గురైన కొందరు స్థానికులు ఈ విషయాన్ని వెంటనే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై  ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేసి మరీ కేటీఆర్ కి ట్యాగ్ చేశారు. రోడ్డు మూసివేయడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు కేటీఆర్ కి వివరించారు. దీంతో... ఆయన వెంటనే స్పందించారు.

దీంతో.. వెంటనే ఈ విషయాన్ని కేటీఆర్.... రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకువచ్చారు. కంటోన్మెంట్ ఏరియాలో వాహనాలకు అనుమతి ఇవ్వాలని ట్వీట్ చేశారు. ఆర్మీ తీరు అసాధారణంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలా రోడ్లు మూసివేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరి ఈ విషయంపై రాజ్ నాథ్ సింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 
 

click me!