మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Mar 14, 2024, 3:29 PM IST

నియోజకవర్గాల పునిర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన మల్కాజ్‌గిరి సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో సంచలనాలు సృష్టించింది. ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వారికి దేశవ్యాప్తంగా కిర్తీ ప్రతిష్టలు రావడంతో పాటు రాజకీయంగా ఉన్నత పదవులు దక్కుతాయన్న సెంటిమెంట్ నిజమవుతూ వస్తోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తోంది. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీలుగా గెలిచిన సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డిలు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఏకంగా టీపీసీసీ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మల్కాజ్‌గిరి అందని ద్రాక్షగానే వుంది. 2014, 2019 ఎన్నికల్లో గులాబీ గాలి బలంగా వీచినా మల్కాజిగిరిలో కారు గెలవలేకపోయింది. 


దేశంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా .. అర్బన్, రూరల్ ఓటర్ల ఆధిపత్యం వున్న మల్కాజ్‌గిరి సెగ్మెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వుంది. నియోజకవర్గం పరిధి.. ఓటర్ల సంఖ్య కూడా అధికమే. సెటిలర్లు పెద్ద సంఖ్యలో వుండటంతో .. అభ్యర్ధుల గెలుపోటములను వారే నిర్దేశిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తోంది. నియోజకవర్గాల పునిర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన మల్కాజ్‌గిరి సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో సంచలనాలు సృష్టించింది.

ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వారికి దేశవ్యాప్తంగా కిర్తీ ప్రతిష్టలు రావడంతో పాటు రాజకీయంగా ఉన్నత పదవులు దక్కుతాయన్న సెంటిమెంట్ నిజమవుతూ వస్తోంది. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీలుగా గెలిచిన సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డిలు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఏకంగా టీపీసీసీ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. 

Latest Videos

మల్కాజ్‌గిరి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. మూడు సార్లూ సంచలనాలే :

2009లో ఏర్పడిన నాటి నుంచి మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ రెండు సార్లు, టీడీపీ ఒకసారి విజయం సాధించాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

ఈ సెగ్మెంట్‌ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 31,50,313 మంది.. వీరిలో పురుషులు 15,11,910 మంది.. మహిళలు 16,38,054 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డికి 6,03,748 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డికి 5,92,829 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి ఎన్ రామచందర్ రావుకు 3,04,282 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 10,919 ఓట్ల మెజారిటీతో మల్కాజిగిరిని కైవసం చేసుకుంది. 

దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడి నుంచి తొలుత సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తన కుటుంబం నుంచి ఎవ్వరూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకోరని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండటంతో ఆయనే మల్కాజ్‌గిరి బరిలో నిలుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా పరిశీలనలో వుంది. 

మల్కాజ్‌గిరి ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 ..  బీఆర్ఎస్‌కు అందని ద్రాక్ష :

బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మల్కాజ్‌గిరి అందని ద్రాక్షగానే వుంది. 2014, 2019 ఎన్నికల్లో గులాబీ గాలి బలంగా వీచినా మల్కాజిగిరిలో కారు గెలవలేకపోయింది. ఈ టికెట్ కోసం మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఆశించారు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కేసీఆర్ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి అత్యంత బలంగా వుంది. దీంతో ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ ఈ పార్లమెంట్ స్థానంలో గెలవాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. మరోవైపు.. బీజేపీ సైతం అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపింది. సీనియర్ నేత ,  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మల్కాజ్‌గిరి అభ్యర్ధిగా కమలనాథులు ప్రకటించారు. దీంతో ఆయన ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. 

click me!