మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ మృతి చెందారు. పాలకుర్తి నుంచి రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ గా సేవలు అందించారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం మరణించారు.
నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసు.. ముక్తార్ అన్సారీకి జీవిత ఖైదు
డాక్టర్ సుధాకర్ రావు విద్యార్థి దశలోనే 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎండోక్రినాలజిస్ట్ గా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి 1999, 2004లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ ఎస్ లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ఛైర్మన్‌గా సేవలు అందించారు.
ఆయన తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలు కావడం విశేషం. తండ్రి ఎన్.యతిరాజారావు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రిగా కూడా సేవలు అందించారు. తల్లి ఓ సారి ఎమ్మెల్యే అయ్యారు. 1999 మొదటి సారి టీడీపీ తరుఫున పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ 2004లో వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాతి కాలంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్య.. భర్తపై అనుమానం..
కాగా.. సుధాకర్ రావు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వైద్యుడిగా, పాలకుర్తి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ధర్మకర్తల మండలి చైర్మన్ గా పనిచేసిన సుధాకర్ రావుతో తనకున్న అనుబంధాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు.