మూడు రోజుల మచ్చటేనా ?.. నిలిచిపోయిన ‘మేల్స్ స్పెషల్’ బస్సు.. అసలేమైందంటే ?

By Sairam Indur  |  First Published Feb 2, 2024, 8:57 AM IST

‘పురుషులకు మాత్రమే’ అనే బోర్డు ఉన్న బస్సుకు (Males special bus) సంబంధించిన ఫొటో గురువారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (photo viral) అయ్యింది. అయితే ఆ బస్సు సర్వీసు నిన్ననే రద్దయ్యింది. కేవలం మూడు రోజుల పాటు ఆ బస్సు సేవలు (TS RTC) అందించింది. అసలేం జరిగిందంటే ?


తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. అప్పటి నుంచి ఆర్టీసీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా అక్యుపెన్సీ పెరిగింది. బస్సులు రద్దీగా నడుస్తున్నాయి. అయితే ఇందులో అత్యధిక శాతం మహిళలే ఉంటున్నారు. దీంతో పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌లో బర్రెను ఆర్డర్ ‌పెట్టిన యూపీ వాసి.. తర్వాత ఏం జరిగిందంటే?

Latest Videos

బస్సుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉండటంతో పురుషులకు సీట్లు దొరకడం కూడా గగనంగా మారిపోయింది. దీంతో పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలనే డిమాండ్ పెరిగింది. మహాలక్ష్మీ పథకం ప్రారంభమయ్యే సమయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా అవసరమైతే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం బస్ డీపో ఆర్టీసీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పురుషుల కోసం మాత్రమే స్పెషల్ బస్సు సర్వీసును ప్రారంభించింది. 

రేవంత్ మార్క్ ప్రజాపాలన షురూ... బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు భారీ నిధులు

ఈ బస్సు ఇబ్రహీంపట్నం - ఎల్బీనగర్ మధ్య గత సోమవారం ప్రారంభమైంది. కానీ అది మూడు రోజుల ముచ్చటగానే మారింది. బుధవారం వరకు ఆ బస్సును నడిపించిన అధికారులు, గురువారం దానిని రద్దు చేశారు. దీంతో పురుషుల కష్టాలు మళ్లీ మొదటికే వచ్చాయి. అయితే పురుషుల కోసం మాత్రమే అనే బోర్డు ఉన్న బస్సుకు సంబంధించిన ఫొటో గురువారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కానీ అప్పటికే ఆ సర్వీసు రద్దయ్యిందని ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. 

బడ్జెట్ లో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ప్రత్యేక దేశం అవసరం - కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం

అసలేం జరిగిందంటే.. ?  
ఇబ్రహీంపట్నం బస్ డీపో ఈ ‘మేల్స్ స్పెషల్’ బస్సును ప్రారంభించింది. ఇది ఇబ్రహీంపట్నం - ఎల్బీనగర్ మధ్య నడిచేది. అయితే ఈ రూట్ లో ప్రతీ రెండు నిమిషాలకు ఓ ఆర్టీసీ బస్సు వస్తుంది. దీంతో మేల్స్ స్పెషల్ బస్సు కోసం పురుషులు వెయిట్ చేయకుండా అందుబాటులో ఏ బస్సు ఉంటే అందులో ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరిపోతున్నారు. దీంతో పాటు ఈ రూట్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా ప్రయణిస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది స్టూడెంట్లు ఇబ్రహీంపట్నం దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు బస్సును రద్దు చేశారు.

click me!