సీఎంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ చేరిక కోసమేనా? : షబ్బీర్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Feb 2, 2024, 7:11 AM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండుమూడు నెలలు కూడా కాలేదు మళ్లీ ఎలక్షన్ హీట్ పెరిగింది. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య  మాటల యుద్దం మొదలయ్యింది.   


హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా పూర్తికాలేదు ... అప్పుడే ప్రభుత్వం కూలిపోబోతోందంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందా, వుండదా అన్నది ఆ పార్టీ వారి చేతుల్లోనే వుందంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఇలా రేవంత్ సర్కార్ గురించి మాట్లాడిన మాజీ సీఎంకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగానే వుందని... ముందు బిఆర్ఎస్ పార్టీ వుంటుందో లేదో చూసుకోవాలని కేసీఆర్ కు సూచించారు షబ్బీర్ అలీ. తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని... పార్టీలో చేరడానికి సిద్దంగా వున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కానీ ఇలా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించకూడదని అదిష్టానం తమకు సూచించిందని ... అందుకోసమే ఆగామన్నారు. ఒకవేళ తాము డోర్లు తెరిస్తే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని షబ్బీర్ అలీ అన్నారు. 

Latest Videos

ప్రజాతీర్పు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పాలన కొనసాగిస్తుందని షబ్బీర్ అలీ అన్నారు. సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఎప్పుడూ వుంటుందన్నారు. కాబట్టి కేసీఆర్ తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం ప్రమాదంలో వుందనే మాటలను పట్టించుకోమని... ప్రజలు కూడా నమ్మరని షబ్బీర్ అన్నారు.

Also Read  రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మరో రెండు గ్యారెంటీలు అమలు..  

ఇక కేంద్ర బడ్జెట్ గురించి కూడా షబ్బీర్ అలీ స్పందించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024 లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు సరిగ్గా జరగలేదన్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చాలా తక్కువ నిధులు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేసారు. దీన్నిబట్టే కేంద్రం మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరు అర్థమవుతుందన్నారు. సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ అంటే ఇదేనా అంటూ కేంద్ర ప్రభుత్వాన్నిఎద్దేవా చేసారు. 

ఇక లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్దంగా వుందని... బిఆర్ఎస్ అసలు ఈ పోటీలోనే వుండదని షబ్బీర్ అలీ అన్నారు. లోక్ సభ ఎన్నికలు బిజెపి, కాంగ్రెస్ మధ్యనే వుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికసీట్లు సాధిస్తుందని షబ్బీర్ అలీ అన్నారు.

  

 

click me!