కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ: కోమటిరెడ్డిపై ఏం చేస్తారు?

By narsimha lodeFirst Published Sep 26, 2018, 4:19 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం బుధవారం నాడు గాంధీభవన్‌లో సమావేశమైంది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం చర్చిస్తోంది.

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం బుధవారం నాడు గాంధీభవన్‌లో సమావేశమైంది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం చర్చిస్తోంది.

రెండో సారి షోకాజ్ నోటీసుపై ఎమ్మెల్సీ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం వివరణను ఇవ్వలేదు. షోకాజ్ నోటీసుకు  ఇచ్చిన గడువు ముగిసి కూడ 24 గంటలు కూడ దాటుతోంది.

ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత చూసీ చూడనట్టుగా వ్యవహరించాలని కూడ కొందరు సీనియర్లు  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యలకు సూచించినట్టు సమాచారం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయమై  రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టు సమాచారం. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని కోమటిరెడ్డి  వివరణ ఇచ్చినట్టు సమాచారం.

ఎన్నికలు జరిగే తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై  చర్యలు తీసుకొంటే  పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని  కాంగ్రెస్ పార్టీ నేతలు  కొందరు  అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  ఏం నిర్ణయం తీసురకొంటుందనేది ప్రస్తుతం అందరూ  ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

తమ్ముడికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...కఠిన నిర్ణయాలు వద్దని సూచన

వదల బొమ్మాళీ: కోమటిరెడ్డికి మరో షోకాజ్ నోటీసు

షోకాజ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డోంట్ కేర్

సీల్డ్‌కవర్లో వివరణ: కోమటిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ

కాంగ్రెసుపై బ్రదర్ ఫైర్: కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

click me!