అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి.. ఏమైందంటే ?

By Asianet NewsFirst Published May 25, 2023, 6:57 AM IST
Highlights

అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి మరణించాడు. పీజీ చదివేందుకు యూఎస్ వెళ్లిన మహబూబ్ నగర్ కు వాసి బోయ మహేష్.. అక్కడ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ వార్త తెలియడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. 

ఉన్నత విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు అకాల మరణం పొందాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబం మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జమ్మూ కాశ్మీర్ ఘోర ప్రమాదం.. అదుపు తప్పిన ట్రక్కు.. ముగ్గురు జవాన్లకు గాయాలు

వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన 25 ఏళ్ల బోయ మహేష్ గతేడాది ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆయన భూత్పూర్‌ మండలం కప్పెట గ్రామానికి చెందిన వ్యక్తి. బోయ వెంకట్రాములు, శకుంతలల పెద్ద కుమారుడు. వీరిది మధ్య తరగతి కుటుంబం. కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి మహారాష్ట్రకు వెళ్లి, అక్కడే ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పెరిగిన మహేష్ ఉన్నత విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలుద్దామనుకున్నాడు. 

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు చేయగా లేనిది.. ఇప్పుడు మోడీ చేస్తే తప్పా - కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి

ఈ క్రమంలో గతేడాది బీటెక్ పూర్తి చేసిన మహేష్.. నిరుడు డిసెంబర్ 29వ తేదీన ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిన్నెసోటాలో ఉంటూ పీజీ చదువుతున్నాడు. అయితే మహేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం అక్కడ కారులో ప్రయాణించాడు. ఆ కారు ప్రమాదానికి గురైంది. ఆ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న మహేష్ తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఆయన ముగ్గురు స్నేహితులకు గాయాలయ్యాయి.

హిందూ దేవాలయాలపై దాడులను సహించబోము.. విధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు - భారత్, ఆస్ట్రేలియా

మహేష్ మరణవార్తను స్నేహితులు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలియడంతో ఆ కుటుంబం మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. కాగా.. మహేష్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇక్కడికి చేరవేయాలని ఆయన యూఎస్ లోని ఆటా సంస్థ ప్రతినిధులను కోరారు. 
 

click me!