విషాదం : కారు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి.. రివర్స్ చేస్తుండగా

Siva Kodati |  
Published : May 24, 2023, 08:27 PM IST
విషాదం : కారు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి.. రివర్స్ చేస్తుండగా

సారాంశం

హైదరాబాద్‌లో హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో కారు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో కారు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు రివర్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారి తల్లి అక్కడికి దగ్గరలో గుంత తీసేందుకు కూలి పన్ను వచ్చింది. దీంతో బిడ్డను సెల్లార్‌లో పడుకోబెట్టింది. ఇదే సమయంలో చిన్నారి పడుకున్న విషయాన్ని చూసుకోకుండా కారు రివర్స్ చేయడంతో దారుణం జరిగింది. విగత జీవిగా పడివున్న బిడ్డను చూసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు