తెలంగాణ రామయ్యకు మహారాష్ట్ర అరుదైన గౌరవం

First Published May 10, 2017, 9:43 AM IST
Highlights

మహారాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో రామయ్య సేవను పాఠ్యాంశంగా చేర్చనున్న ప్రభుత్వం

కోటి మొక్కలు నాటే దిశగా తెలంగాణను హరితహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్న ఒకే ఒక్కడు వనజీవి రామయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.

 

కేంద్రం కూడా ఆయన సేవను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో ఇటీవల సత్కరించిన విషయం తెలిసేందే.

 

ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు మరో అరుదైన గౌరవాన్ని ఇస్తోంది.

 

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది.

 

రామయ్య కోటి మొక్కలు నాటి సమాజానికి ఏ విధంగా సేవ చేస్తున్నారో పాఠ్యాంశాల్లో వివరించి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నిస్తామని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

click me!