మైనర్ బాలికతో ప్రేమ.. ఇంట్లో ఒప్పుకోలేదని, పురుగుల మందు తాగి.. !

By AN Telugu  |  First Published Mar 30, 2021, 1:34 PM IST

మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. యువతి మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. 


మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. యువతి మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. 

ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ లో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ కుటుంబం మహబూబాబాద్ జిల్లా, కేసముద్రంలో కొంతకాలంగా నివాసముంటోంది.

Latest Videos

ఇదే జిల్లా గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు.. ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. 

దీంతో మనస్తాపం చెందిన ఈ జంట.. ఈ నెల 27న నెక్కొండ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర  పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వారిని చికిత్స చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం యువతి మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. దీనిపై ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
 

click me!