యూపీలో మూడు నెలల క్రితం కిడ్నాపైన బాలిక: క్షుద్రపూజలకు వచ్చిన పూజారి అరెస్ట్

Published : Mar 30, 2021, 12:31 PM IST
యూపీలో మూడు నెలల క్రితం కిడ్నాపైన బాలిక: క్షుద్రపూజలకు వచ్చిన పూజారి అరెస్ట్

సారాంశం

మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లాలో కిడ్నాపైన బాలిక ఆచూకి యూపిలో లభించింది. బాలికను పోలీసులు ఇక్కడికి తీసుకుని వచ్చారు. నిందితుడు సూర్యప్రకాశ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం: మూడు నెలల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యమైంది. ఈ కేసులో పోలీసులు గుంటూరుజిల్లాకు చెందిన పూజారి సూర్యప్రకాశ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూర్యప్రకాశ్ శర్మ బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

పూజారి సూర్యప్రకాశ్ శర్మ క్షుద్రపూజల నిమిత్తం ఖమ్మం జిల్లా రేమిడిచర్లకు వచ్చాడు. క్షుద్రపూజల కోసం రేమిడిచర్లలోని ఓ ఇంటిలో 25 అడుగుల లోతు గోయి కూడా తవ్వారు. ఆ సమయంలోనే బాలికను సూర్యప్రకాశ్ శర్మ కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. 

బాలిక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందని గుర్తించి పోలీసులు ఆమెను తీసుకుని వచ్చారు. బాలికను ప్రస్తుతం ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచారు. త్వరలో బాలికను తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది.

నిందుతుడు సెల్ ఫోన్ వాడడం లేదని, దానివల్ల ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతూ వచ్చారు మొత్తం మీద బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. 

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం