తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ఇంచార్జీలను నియమించింది. ఆ పార్టీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. 17 లోక్ సభ స్థానాలకు ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇంచార్జ్ లు గా నియమించారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ కార్యచరణను ఇప్పటికే ప్రారంభించాయి. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణ ప్రయోజనాలను బీఆర్‌ఎస్ మాత్రమే కాపాడగలదు - కేటీఆర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్గీ నేతలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చేసిన పొరపాట్లను పార్లమెంట్ ఎన్నికల్లో చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.
కారణమిదీ: స్వంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న కాంగ్రెస్ కూడా అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఉన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ అధిష్టానం వారికి సూచనలు చేసింది.
రాహుల్ గాంధీ ఇంకా చిన్నపిల్లాడే.. సరదా కోసమే యాత్రలు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
అలాగే ఈ కేంద్రంలో అధికారంలో ఉండి, మరో సారి కూడా అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ కూడా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవడం ధ్యేయంగా ఆ పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఈ ఇంచార్జీలను ఖరారు చేశారు.
మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పగ్గాలు.. ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం..
ఇందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్ కు పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు, నిజామాబాద్ కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్ కు వెంకటరమణా రెడ్డి, మెదక్ కు హరీష్ బాబు, కరీంనగర్ కు ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్తా, మల్కాజ్‌గిరికి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్‌కు లక్ష్మణ్, హైదరాబాద్ కు రాజాసింగ్, చేవెళ్లకి వెంకట్ నారాయణ రెడ్డి, మహబూబ్‌నగర్ కు రామచంద్రరావు, నాగర్ కర్నూల్ కి మాగం రంగారెడ్డి, నల్గొండ కి చింతల రాంచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, వరంగల్ కు మర్రి శశిధర్ రెడ్డి, మహబూబ్‌నగర్ కు గరికపాటి రామ్మోహన్‌రావు, ఖమ్మం కు పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను నియమించారు.