సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణ నుంచి 9 మందికి తొలి జాబితాలో భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను వ్యూహాత్మకంగా మల్కాజ్‌గిరి నుంచి బరిలో దించారు కమలనాథులు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ 195 మందితో తన తొలి జాబితాను ప్రకటించింది. దీనిలో భాగంగా తెలంగాణ నుంచి 9 మందికి ఈ జాబితాలో అవకాశం కల్పించింది. నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌లలో సిట్టింగ్‌లకు మరో ఛాన్స్ ఇచ్చిన బీజేపీ.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్‌గిరి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బరిలోకి దించింది. తొలి జాబితాలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావ్ పేరు కనిపించలేదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది.
హైదరాబాద్ - మాధవీలత
నిజామాబాద్ - ధర్మపురి అర్వింద్
కరీంనగర్ - బండి సంజయ్
మల్కాజ్‌గిరి - ఈటల రాజేందర్
నాగర్ కర్నూల్ - భరత్ గౌడ్
చేవేళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జహీరాబాద్ - బీబీ పాటిల్
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
కాగా.. శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అభ్యర్ధుల జాబితాను పార్టీ నేతలు వినోద్ తావడే, అర్జున్ పాండేలు విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తారని వినోద్ తావడే వెల్లడించారు. తొలి జాబితాలో 28 మహిళలకు అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. 16 రాష్ట్రాల్లోని 195 నియోజకవర్గాలకు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే బిజెపి అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ గారు ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణలోని 9 లోక్ సభ స్థానాలకు బిజెపి అభ్యర్థులను ఖరారు చేశారు.
విజయీభవ! pic.twitter.com/pniwtG1J97