మోడీ మళ్లీ ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది - ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

By Sairam Indur  |  First Published Mar 2, 2024, 3:20 PM IST

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు.


బీజేపీ నాయకుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు. మోడీ మరో సారి ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తెలిపారు. హన్మకొండలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్యకు వెళ్లే దమ్ము కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం.. ఎందుకంటే ?

Latest Videos

ఒక వేళ ఆ ఇద్దరు నాయకులు అయోధ్యకు వెళ్తే తల నరక్కుంటానని రాకేశ్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని, ఒక వేళ అలా చేస్తే దేశం మళ్లీ ముక్కలు అవుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ లు పేమెంట్ కోటా పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ కు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు.. ఎందుకంటే ?

కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయితే, బీజేపీ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని రాకేశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెబుతూ తెలంగాణ ప్రజలను గందరగోళంలోకి నెట్టి వేస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దానిపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అవినీతిలో భాగస్వామ్యం అయిన వారందరినీ అరెస్ట్ చేయాలని సూచించారు. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

click me!