కరోనాా నిబంధనలను ఉల్లంఘించి ఇంటినుండి బయటకు వస్తున్న వారికి రామగుండం సిపి గట్టిగా హెచ్చరించారు.
గోదావరిఖని పట్టణ వీధుల్లో బుల్లెట్ పై తిరుగుతూ రామగుండం సిపి పెట్రోలింగ్ నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న వారిపై కొరడా ఝుళిపించారు కోత్వాల్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పట్టణ వీధుల్లో సాయంత్రం సమయంలో పెట్రోలింగ్ చేపట్టారు. గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్, అడ్డగుంట పల్లి, రమేష్ నగర్, విఠల్ నగర్, తిలక్ నగర్, దూల్ పేట్ ఏరియా, 5ఇంక్లైన్ ఏరియాలలో కర్ఫ్యూ అమలు పై బుల్లెట్ వాహనంపై తిరుగుతూ పరిశీలించారు. కర్ఫ్యూ లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న యువకులపైన కొరడా ఝుళిపించడమే కాదు సామాజిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా ఇంటి ముందు కూర్చున్నా వ్యక్తులకి, మహిళలకు అవగాహన కల్పించారు.
undefined
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... లాక్ డౌన్ ప్రక్రియను ఇంకా కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని.... ఆ రెండు ప్రాంతాలను రెడ్ జోన్లుగా చేయడం జరిగిందన్నారు.
సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పూర్తి కర్ఫ్యూ వాతావరణం పగడ్బందీగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో యువకులు ఏదో ఒక కారణం చెబుతూ అనవసరంగా బయట తిరుగుతూ సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ, మాట్లాడుతూ బయట తిరగడం జరుగుతుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల రక్షణ కై అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలు కొంతమంది అవి పాటించకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని... ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.
స్వీయ నిర్బంధం ఇండ్లలో ఉండాలని... అనవసరంగా బయట తెలియకూడదని అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది ప్రజలు వాటిని బేఖాతరు చేస్తున్నారన్నారు. రేపటి నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో ఎవరైనా అనవసరంగా ఎలాంటి అత్యవసర కారణం లేకుండా నిర్లక్ష్యపు ధోరణి తో బయట తిరిగినా వారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి, హాస్పిటల్ వెళ్లాల్సి వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో పాసులు తీసుకొని వెళితే వారికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకి ప్రజలకు చాలా వెసులుబాటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రావడం జరిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేవన్నారు. సిపితో పాటుగా గోదావరిఖని ఏసిపి ఉమేందర్, ఏఆర్ ఏసిపి సుందర్ రావు, గోదావరిఖని1వ పట్టణ సిఐలు పి రమేష్, రాజ్ కుమార్, గోదావరిఖని వన్ టౌన్ ఎస్సై ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు.