హైదరాబాద్‌: భారీగా వాహనాల సీజ్, కేసులు.. రోడ్డుపైకి రావాలంటే జంకుతున్న జనం

By Siva Kodati  |  First Published May 22, 2021, 5:22 PM IST

హైదరాబాదీల్లో మార్పు కనిపించింది. రోడ్డుపై వాహనాల రద్దీ తగ్గింది. నిన్న మొన్న వరకు వాహనాలతో కిక్కిరిసిపోయిన రోడ్లు... ఇవాళ ఖాళీగా కనిపించాయి. లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించిన వాహనాలు తిరుగుతున్నాయి


హైదరాబాదీల్లో మార్పు కనిపించింది. రోడ్డుపై వాహనాల రద్దీ తగ్గింది. నిన్న మొన్న వరకు వాహనాలతో కిక్కిరిసిపోయిన రోడ్లు... ఇవాళ ఖాళీగా కనిపించాయి. లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించిన వాహనాలు తిరుగుతున్నాయి. వరుస కేసులు, వాహనాల సీజ్‌లతో.. అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారికి చెక్ పెట్టారు పోలీసులు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వచ్చి పోయే ప్రతి వాహనాన్ని ఆపి చెక్ చేశారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారిని గుర్తించి వాహనాలను సీజ్ చేశారు. మూడు కమీషనరేట్ల పరిధిలో వేల సంఖ్యలో వాహనాలు సీజ్ అయ్యాయి. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత వాటిని కోర్టు నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.  

Latest Videos

undefined

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు జిల్లాల సరిహద్దుల్ని పూర్తిగా మూసివేయనుంది. బోర్డర్ దాటి ఒక్కరూ కూడా రాష్ట్రంలోకి రాకుండా , బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

Also Read:జిల్లాల సరిహద్దుల మూసివేత, ఏదైనా ఆ 4 గంటలే : తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం

రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతించనున్నారు. పోలీసులు సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ తర్వాత కోర్టుకు వచ్చి తీసుకోవాల్సి వుంటుందని స్పష్టం చేశారు. 

కాగా, రాష్ట్రంలోని లాక్‌డౌన్ పరిస్ధితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర రెవెన్యూను లెక్క చేయకుండా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని... కలెక్టర్లు, డీజీపీ, పోలీసు అధికారులు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించాలని కేసీఆర్ సూచించారు. వారం పదిరోజుల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

click me!